Breaking News

భార్యను కాపురానికి పంపలేదని మామ పై కత్తితో దాడి చేసిన అల్లుడు.

0 36

(అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం): రాజేంద్రపాలెం పంచాయతీ,సోలాబు గ్రామానికి చెందిన పాంగి భాస్కరరావు తన కుమార్తె అయిన లక్ష్మిని సుమారు 18 సంవత్సరాలు క్రితం జీకే వీధి మండలం,చినగొంది గ్రామానికి చెందిన వంతల చిట్టిబాబు కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితం తన కుమార్తె,అల్లుడు కాకరపాడు గ్రామానికి వచ్చి నివాసము ఉంటున్నారు. గత కొంతకాలంగా తన కుమార్తె అయిన లక్ష్మి ని అల్లుడు సరిగా చూసుకోకుండా శారీరకంగా వేధించడం వల్ల తన కుమార్తెను తనతోపాటు ఇంటికి తీసుకువెళ్లి చూసుకోవడం జరుగుతుంది. దీంతో కోపం పెంచుకున్న అల్లుడు తన భార్యను కాపురానికి పంపకపోతే చంపేస్తానని మామని హెచ్చరించాడు. అయితే ఈనెల 11న కాకరపాడు గ్రామంలో గల మెకానిక్ షెడ్ వద్ద పాంగి భాస్కరరావు ఉండగా అదే అదునుగా చూసి తన అల్లుడైన వంతలు చిట్టిబాబు కత్తితో తలపై నరికి చంపడానికి ప్రయత్నిస్తుండగా పాంగీ భాస్కరరావు కి తల పైన ఎడమ మోచేతి పైన గాయాలయ్యాయి. ఇది చూసి ఆపడానికి ప్రయత్నిస్తున్న మర్ర శ్రీను అనే వ్యక్తికి చేతికి గాయమైంది.ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న కొయ్యూరు ఎస్ఐ రాజారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.