సప్పర్ల పీహెచ్సీ పరిధిలో ఈ ఒక్క నెలలోనే మూడు శిశు మరణాలు.
డీడీఓ గా ఉన్న డాక్టర్ సంతకం మిస్ యూజ్.
ఆరు నెలలు ఇవ్వాల్సిన మెటర్నిటీ లీవ్ డాక్టర్ మేనేజ్ చేయడం వల్ల 8నెలలు సచివాలయం ఏఎన్ఎం కు సెలవులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని సప్పర్ల పిహెచ్సీ పరిధిలో ఈ ఒక్క నెలలోనే మూడు శిశు మరణాలు జరిగాయి.గాలికొండ పంచాయితీ లోని గడిబంధ,చిలకవీధి అలాగే ఎస్.కొత్తూరు గ్రామాల్లో సుమారుగా మూడు నెలల వయస్సు గల ముగ్గురు శిశువులు మరణించారు. మూడు చోట్ల చెప్పిన ఒకే ఒక కామన్ పాయింట్ చనిపోయే ముందు వరకు ఆడుతూనే ఉన్నారు, బాగానే ఉన్నారు, కానీ హఠాత్తుగా మరణించారు అనే సమాధానం చెబుతున్నారు. అయితే శిశువుల మరణాలకు కారణం ఏంటి? అనే విషయం అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. సప్పర్ల పీహెచ్సీ పరిధిలో పుట్టి మూడు నెలలు అయిన తర్వాత ఇటువంటి శిశు మరణాలు జరుగుతున్నాయి అంటే ఎందువల్ల ఇటువంటి మరణాలు జరుగుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టిన బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోవాలని, చూసుకోవాలని అనుకున్న తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఆడుతూ చేతిలో ఉండగానే మరణించారని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ పి హెచ్ సి పరిధిలో ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు,దానితోపాటు గర్భిణీలకు బాలింతలకు మెడికల్ సిబ్బంది అవగాహన కల్పించడం వంటివి చేస్తే తప్ప ఇటువంటివి ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ ఉండాల్సిన నేపధ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన సచివాలయ ఏఎన్ఎం కూడా గ్రామాల్లోకి వచ్చి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని అక్కడి గ్రామస్తులను అడగగా సచివాలయ ఏఎన్ఎం ఎవరో కూడా తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం.అయితే ఈ విషయమై సచివాలయం ఏఎన్ఎం సత్యప్రభ ను వివరణ అడగగా తాను మెటర్నిటీ లీవ్ లో ఉన్నట్లు సమాధానం చెప్పారు.అయితే సచివాలయం ఏఎన్ఎం గురించి అక్కడ విధులు నిర్వహిస్తున్న మెడికల్ సిబ్బందిని అడగగా కొంతమంది తాను మార్చి నెలలో మెటర్నరీ లీవ్ తీసుకున్నారని ఈ రోజే విధుల్లో జాయినింగ్ అయినట్లు చెప్పారు. మరి కొంతమంది మాత్రం ఆమె జనవరి 23వ తేదీన మెటర్నరీ లీవ్ తీసుకున్నట్లు చెప్పారు.ఈ పూర్తి వివరాలు చూసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగినిలకు 6నెలలు వరకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు.కానీ సప్పర్ల పీహెచ్సీ లో మాత్రం మెటర్నిటీ లీవ్ 8 నెలలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇందులో రెండు నెలలు డాక్టర్ మేనేజ్ చేయడం జరిగిందని తెలుస్తుంది.దీనిని బట్టి ఆ పీహెచ్ సీ లో డీడీఓ గా ఉన్న డాక్టర్ సంతకాన్ని మిస్ యూజ్ చేసినట్లు క్షుణ్ణంగా తెలుస్తుంది. దీనిని బట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న మెడికల్ సిబ్బంది అప్పుడప్పుడు విధులకు హాజరు కాకపోయినా తాను మేనేజ్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇటువంటి తప్పిదాలు, పూర్తిస్థాయిలో మెడికల్ సిబ్బంది పర్యవేక్షణ లోపం,అలాగే అవగాహన కల్పించడంలో కూడా లోపం వల్లే శిశు మరణాలు జరిగినట్లు భావించవచ్చు.డాక్టర్ ఈ విధంగా తన సంతకాన్ని మిస్ యూజ్ చేయడం వల్ల ఏం జరిగినా డాక్టర్ చూసుకుంటారులే అని ఆ సిబ్బంది అనుకొని ఫీల్డ్ కి వెళ్లకపోతే ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోతే ఇటువంటి శిశు మరణాలే కాదు అవగాహన లేమితో మరణాలు ఇంకా అనేకం జరుగుతాయనడంలో సందేహం లేదు. కనుక డాక్టర్ సందీప్ తన సంతకాన్ని మిస్ యూజ్ చేయకుండా పీహెచ్సీ సిబ్బందిని ఎప్పటికప్పుడు గ్రామల్లోనికి పంపిస్తూ గిరిజనులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.