Breaking News

ఎస్టీ ఎంపీపీ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి.

0 19

 ఎస్టీ ఎంపీపీ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి.

 ఎంపీపీ ల సంఘం ఎస్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి నీలవేణి డిమాండ్.

శెట్టి నీలవేణి (ఎంపీపీ)

(అల్లూరి జిల్లా,అనంతగిరి): కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి చెందిన ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి పై దాడికి పాల్పడ్డ గిరిజనేతరులపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎంపీపీ ల సంఘం ఎస్టీ  విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శెట్టి నీలవేణి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రౌతులపూడి ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి గిరిజన తెగ మహిళ కాగా ఆమె ఎంపీపీ గా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అటువంటి ఆమెను పిహెచ్ సి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోగా దానిని ప్రశ్నించిన ఎంపీపీ పై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని నీలవేణి ప్రశ్నించారు. గిరిజన తెగకు చెందిన మహిళ ఎంపీపీ స్థానంలో ఉన్నప్పటికీ ఆమెకు దక్కాల్సిన, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ప్రశ్నించడాన్ని తట్టుకోలేక దాడులకు పాల్పడడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనని నీలవేణి మండిపడ్డారు.

 రాజ్యలక్ష్మి పై దాడికి పాల్పడిన వారిపై బేషరతుగా కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా పోలీస్ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఆమెపై దాడిని ఖండిస్తూ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో జిల్లా ఎంపీపీ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆ కార్యక్రమానికి ఎంపీపీ లందరూ హాజరు అవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ దాడిపై ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల హనుమంతరావు నేతృత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.