అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం,బూదరాళ్ళ పంచాయితీ లోని గరిమండ గ్రామానికి చెందిన కిల్లో భీమరాజు బుధవారం పిడుగు పాటుకు గురై అక్కడికి అక్కడే మరణించాడు.సల్దిగెడ్డ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.ఇతనికి భార్య ఆరుగురు పిల్లలు ఉన్నారు.ఇతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.