Breaking News

తప్పు చేస్తే చట్టం ఎవరికీ చుట్టం కాదు: వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి

0 111

•తప్పు చేస్తే చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు.

•చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.

-వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు దోషి అని కోర్టు భావిస్తే ఆయనకు శిక్ష పడక తప్పదు అని,తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని,చట్టం ఎవరికీ చుట్టం కాదు అని వైఎస్ఆర్సిపి చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు దృష్టిలో అందరూ సమానమే అని అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున వాదించేందుకు ఉద్దానయోధులైన లాయర్లు వచ్చినప్పటికీ,కోర్టు ఆయనకు రిమాండ్ ను పొడిగిస్తుందంటే!ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో దాస్తున్నారనే విషయాన్ని కోర్టు,ఆయన తరపున వాదిస్తున్న లాయర్లు ఇప్పటికే గ్రహించి ఉంటారని,అందుకే ఆయనకు కోర్టు రిమాండ్ ను పొడిగిస్తున్నప్పటికీ ఆయన తరుపున వాదిస్తున్న లాయర్లు ఏమి చేయలేని నిశ్శహాయ స్థితిలో ఉన్నారని అన్నారు.టిడిపి నాయకులు నిరసన కార్యక్రమాలు అంటూ ప్రజలను ఎంత మభ్య పెట్టాలని చూసినా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర లేదంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ లో మోసపోయిన వారిలో గిరిజన ప్రాంతంలో సుమారు 36 మంది ఉన్నారని,స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొంది జీతభత్యాలు లేకుండా రెండేళ్లు పనిచేసి తాము మోసపోయామని గ్రహించి ఇంటి ముఖం పట్టారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో మోసపోయిన వారిలో మైదాన ప్రాంతం నుండి కూడా అనేక మంది ఉన్నారని అన్నారు.చంద్రబాబు నాయుడు ఎవరినైనా మోసం చేయగల సమర్ధుడని, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుందని, తప్పు చేస్తే చట్టం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అర్థమయి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు,కార్యకర్తలు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయమై ప్రజలను మభ్య పెట్టాలనే ఆలోచన నుండి బయటకు రావాలని.. మీరు ఎన్ని జంతర్ మంతర్ లు చేసినా ప్రజలు నమ్మే పరస్థితిలో లేరని మళ్ళీ 2024లో జగనన్న ముఖ్యమంత్రి కావటం కాయం పాడేరు నియోజకవర్గంలో భాగ్యలక్ష్మి బంపర్ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజలను మోసం చేసే నాయకుల కాలం చెల్లిపోయిందని ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సింహం సింగిల్గానే రికార్డులు నమోదు చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎప్పుడు అండగానే ఉంటారని ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని కార్యకర్తలు,నాయకులు సమిష్టిగా పనిచేస్తున్నారని చెప్పటం జరిగింది

Leave A Reply

Your email address will not be published.