అల్లూరి సీతారామరాజు జిల్లా: చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేశారంటూ నిరసనగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరాపల్లి పంచాయతీలో టిడిపి కార్యకర్తలతో మాజీ జిసిసి చైర్మన్ ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదని ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మొట్టడం రామకృష్ణ,గడుతూరి అప్పారావు,పండ్రా నూకరాజు,మొట్టడం నూకరాజు,జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.