Breaking News

ఆటో బోల్తా పడి ఐదేళ్ల బాలుడు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.

0 16


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని గోకిరి గ్రామానికి చెందిన కొంతమంది మత ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా మంగళ వారం సాయంత్రం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయితీ తెప్పల మామిడి సమీపంలో AP391 S1020 అను నెంబర్ గల ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.శాతా బిందు అనే ఆమె ఐదేళ్ల బాలుడు శాతా విశాల్ తేజ మృతి చెందాడు. పలువురు పరిస్థితి విషమంగా ఉంది.కుడుముల వెంకటలక్ష్మి కి కుడి చేయి,ఎడమ కాలు, పక్కటెముకలు విరిగిపోగా,రాటా రాజుబాబు కి ఎడమ చేయి విరిగింది,కుడుముల పాపాయమ్మ కి తలపై తీవ్ర గాయాలయ్యాయి.

కుడుముల కుమారి కి నడుము విరిగిందని డాక్టర్ లు చెబుతున్నారు.కసిపల్లి అనూష కి తలపై తీవ్ర గాయాలు అలాగే రక్తం గడ్డ కట్టింది,కసిపల్లి నూకరత్నం మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.కుడుముల వెంకటలక్ష్మి,రాటా రాజుబాబు, కుడుముల పాపాయమ్మ నర్సీపట్నం లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.


కుడుముల కుమారి,కసిపల్లి అనూష,కసిపల్లి నూకరత్నం అను ముగ్గురికి విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, రామకృష్ణ దంపతులు,కొండగోకిరి సర్పంచ్ రేగటి ముసలి నాయుడు,వైసీపీ నాయకుడు రామరాజు హుటాహుటిన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.

విశాల్ తేజ మృతదేహం


వెనువెంటనే పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించి,గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేలా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నందు ఎస్టీ సెల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, ఐటీడీఏ పీఓ అభిషేక్ ని కోరడం జరిగింది.పీఓ అభిషేక్ సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.