Breaking News

కుస్తీ పోటీల్లో కొయ్యూరు మండలానికి గోల్డ్,సిల్వర్,కాంస్య మెడల్స్.

0 259

అంతర్ జిల్లాల కుస్తీ పోటిల్లో కొయ్యూరు మండలానికి దండిగా గోల్డ్, సిల్వర్ మెడల్స్.

ఓవరల్ ఛాంపియన్ షిప్ లో దక్కిన ప్రధమ,ద్వితీయ స్థానాలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు:అంతర్ జిల్లాల(రెజిలింగ్)కుస్తీ పోటిల్లో అల్లూరి జిల్లా లోని కొయ్యూరు మండలానికి ఏకంగా 14గోల్డ్,2సిల్వర్,7కాంస్య మెడల్స్ దక్కాయి.స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా ఇటీవల అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు కృష్ణా జిల్లా లో నిర్వహించారు.ఈ కుస్తీ పోటిల్లో కొయ్యూరు మండలం నుండి దాదాపు 140మంది వరకు పాల్గొన్నారు.ఈ మేరకు రెండు రోజుల పాటు అక్కడ జరిగిన కుస్తీ పోటిల్లో అండర్ – 14బాయ్స్ టీముల్లో కొయ్యూరు కు 5గోల్డ్,ఒక కాంస్య మెడల్ దక్కగా,అండర్ -14 బాలికల పోటిల్లో 1-గోల్డ్ 1సిల్వర్,2కాంస్య మెడల్స్ దక్కినట్టు రెజిలింగ్ కోచ్ అంబటి నూకరాజు తెలిపారు.అలాగే అండర్ -17 కుస్తీ పోటిల్లో బాలికలకు -7గోల్డ్ మెడల్స్ బాలురకు -1గోల్డ్,2-కాంస్య మెడల్స్ లభించినట్టు తెలిపారు.వీటితో పాటు మండలానికి అండర్ -17 కుస్తీ పోటిల్లో బాలికలకు ఓవరాల్ ఛాంపియన్ షిప్ లభించగా,అండర్ -14 పోటిల్లో బాలురకు కూడా ఓవరల్ ఛాంపియన్ షిప్ రెండవ స్థానం దక్కినట్టు కోచ్ నూకరాజు తెలిపారు.ఐటీడీఏ రెజిలింగ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో కొయ్యూరు నుండి వెళ్లిన బాలురు,బాలికల పోటిల్లో ఐటీడీఏ ప్రోత్సహం పై మండలానికి 24 గోల్డ్,సిల్వర్,కాంస్య మెడల్స్ రావటం పట్ల ఐటీడీఏ పిఓ అభిషేక్,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కల్పించిన ప్రోత్సహంతోనే కొయ్యూరు మండలానికి ఇంతటి ప్రాముఖ్యత లభించినట్టు రెజిలింగ్ కోచ్ అంబటి నూకరాజు,సిఏహెచ్ స్కూల్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. అదే స్పూర్తితో అక్టోబర్ 1 న మధ్యప్రదేశ్ (భోపాల్ )లో నిర్వహించే నేషనల్ రెజిలింగ్ అకాడమీ స్కూల్ గేమ్స్ పోటిల్లో ఈ మండలం నుండి 14మంది బాలురు,బాలికలు పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు.కాగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా కొయ్యూరు సిఏహెచ్ స్కూల్ బాయ్స్ ఓన్ ఆశ్రమ పాఠశాల పీడి అలాగే కోచ్ అంబటి నూకరాజు ఈ కుస్తీ పోటీలకు ప్రత్యేక శిక్షణ అందించి మండలానికే ఇన్ని అవార్డులు, మెడల్స్ పొందేందుకు కృషి చేసినందుకు ఆయనకు పాఠశాల ఉపాధ్యాయలు,విద్యార్థులు అభినందనలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.