Breaking News

బ్రెజిల్ పర్యటనలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.

0 20

 బ్రెజిల్ పర్యటనలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.

వివిధ అంశాలపై అధ్యయనానికి కేంద్ర మంత్రి ఆధర్వంలో బ్రెజిల్ వెళ్లిన పార్లమెంటరీ కమిటీ.

తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి వివిధ అంశాలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా నియమింపబడ్డారు. ఈ కమిటీ ఆధ్వర్యలో ఆయన బ్రెజిల్ వెళ్లారు. ఒక కేంద్ర మంత్రి 9 మంది ఎంపీలతో కూడిన ఈ బృందం రెండు రోజుల క్రితం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ బృందానికి కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అంశాలపై అధ్యయనం జరపనున్నారని తెలియవచ్చింది.

ముఖ్యంగా ఇండియా బ్రెజిల్ మధ్య సంబంధాలను దృఢ పరచడం,ఆ దేశ పార్లమెంటరీ విధి విధానాలు వారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, వ్యవసాయంలో వారు అవలంబిస్తున్న అధునాతన పద్ధతులను ఈ బృందం అధ్యయనం చేయనుందని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒంగోలు జాతి గిత్తల ద్వారా ఆ దేశం వాళ్ళు రూపొందించిన సాంకేతికత ద్వారా మన దేశానికనే మెరుగైన మంచి పాల ఉత్పత్తి సాధించారని ఆ టెక్నాలజీపై కూడా ఈ పర్యటనలో అధ్యయనం చేయనున్నాం అని తెలియజేసారు.

ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, బ్రెజిల్ వరుసగా భారతదేశం అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, బ్రెజిల్ 10 వ స్థానంలో ఉన్నాయి కానీ ఫర్ క్యాపిటల్ విషయంలో మన దేశ ఫర్ క్యాపిటల్ రెండు వేల డాలర్లుగా ఉండగా బ్రెజిల్ దేశ ఫర్ క్యాపిటల్ పది వేల డాలర్లుగా ఉందని ఈ అంశంపై కూడా తమ అధ్యయనం ఉండబోతుందని ఆయన తెలియజేసారు.

ఈ అధ్యయన కమిటీ బ్రెజిల్ వెళ్లిన సందర్బంగా జరిగిన సమావేశంలో ఆ దేశ ముఖ్యులు అయినటువంటి సెనేటర్ నెల్సిన్హో ట్రేడ్, (బ్రెజిల్ సెనేట్లో బ్రెజిల్ ఇండియా పార్లమెంటరీ ఫ్రంట్ అధ్యక్షుడు) మిస్టర్ రోడ్రిగో పచేకో (బ్రెజిల్ సెనేట్ అధ్యక్షుడు) బ్రెజిలియన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మార్కోస్ పెరీరా, ఫెడరల్ డిప్యూటీ మిస్టర్ వినిసియస్ కార్వాల్హో, ఇండియా-బ్రెజిల్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.