Breaking News

ప్రతీ బాల్య వివాహానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

0 305

ప్రతీ బాల్య వివాహానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం

ప్రతీ బాల్య వివాహానికి పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం నర్సీపట్నం డివిజనల్ ఎఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కోరారు.
నర్సీపట్నం పర్యటనలో ఉన్న సీతారాం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా జరిగిన భేటీలో బాల్య వివాహాలు,బాలల హక్కుల పరిరక్షణకు అందించాల్సిన సహాయ సహకారాలుపై చర్చించారు.
అనంతరం ఎఎస్పీ రాణా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం తమ దృష్టికి తీసుకొచ్చిన వివిధ అంశాల పరిష్కారానికి చర్యలు చేపడతామని అన్నారు,బాల్య వివాహాల నిర్మూలనకు,బాలల హక్కుల పరిరక్షణకు,పోలీసు సిబ్బంది,అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేసి బాలల హక్కుల పరిరక్షణ తమ పూర్తి మద్దతును అందిస్తామని అన్నారు.
ఏఎస్పీని కలసిన వారిలో నర్సీపట్నం సీడిపిఓ మేరీ సువార్త,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.