Breaking News

బాల్య వివాహాలు నిర్మూలనలో ప్రజా ప్రతినిధులు అండదండలు కీలకం:రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు సీతారాం

0 87

బాల్య వివాహాలు నిర్మూలనలో ప్రజా ప్రతినిధులు అండదండలు కీలకం:రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు సీతారాం

నర్సీపట్నం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలును పూర్తి స్థాయిలో నిర్మూలన జరగాలంటే ప్రజా ప్రతినిధుల అండదండలు శత శాతం అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు,స్థానిక ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడియస్ నర్సీపట్నం చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ మేరీ సువార్త నేతృత్వంలో శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కైలాస్ సత్యార్థి ఫౌండేషన్,జిల్లా బాలల సంరక్షణ విభాగం,పోలీసు,విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ సచివాలయాల మహిళా సంరక్షణ,సంక్షేమ,విద్యా కార్యదర్శులుతో బాల్య వివాహాలు నిలుపుదలలో ప్రజా ప్రతినిధులు,వార్డుల సచివాలయాల కార్యదర్శులు ప్రత్యక్ష పాత్ర పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు,సీడ్ సంస్థ బాల్య వివాహాలుపై రూ పొందించిన వాల్ పోస్టర్లును సీతారాం చేతులు మీదుగా ఆవిష్కరించారు,
అనంతరం కమిషన్ సభ్యులు సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు,మండలాల్లోని అధికారులు,అనధికారులు,ప్రజా ప్రతినిధులు
బాలలుతో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు,సంఘాలుతో వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని తెలిపారు,ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా 21 బాల్య వివాహాలు నిలుపుదలలో జిల్లా కలెక్టర్,ఎస్పీ,స్త్రీ,శిశుసంక్షేమ శాఖ లతో పాటు మరిన్ని ప్రభుత్వ శాఖలు అద్వితీయమైన పనితీరు కనపరచడాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రశంసిస్తోందని అన్నారు,రాష్ట్ర ప్రభుత్వం,బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లు సంయుక్తంగా బాల్య వివాహాలు నిర్మూలనే ప్రధాన అజెండాగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు,బాల్య వివాహాలను ఆపిన అనంతరం సంభందిత బాలికలు ఎక్కడున్నారో డేగ కళ్ళతో పర్యవేక్షణ జరిపి వారికి మళ్లీ విద్యాబుద్ధులు కొనసాగించేలా స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో గ్రామ,వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు,వార్డుల అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు,ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు చేపట్టాలని సూచించారు,ఇటీవల ప్రభుత్వం జీ.ఓ నంబర్ 31 అమలులోకి తీసుకొచ్చిందని అన్నారు,దీనిలో వార్డ్ మహిళా సంక్షేమ కార్యదర్శులకు కీలక బాధ్యతలను అప్పిగించడం జరిగిందని గుర్తు చేశారు,ఈ నేపద్యంలో అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల పరిధిలో మహిళా సంరక్షణ కార్యదర్శులుతో బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అమలు జరిగేలా అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు,ఈ కార్యక్రమంలో పోషణ మహోత్సవ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.
నర్సీపట్నం మునిసిపల్ చైర్మన్ శ్రీమతి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని కౌన్సిలర్లు బాల్య వివాహాల్లో పాల్గొకుండా అవహానా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు,బాల్య వివాహ రహిత మునిసిపాలిటీగా పేరు ప్రఖ్యాతలు తెస్తామని అన్నారు.
నర్శిపట్నం ఎంపిపి.సుర్ల రాజేశ్వరి మాట్లాడుతూ మండల స్థాయిలో
అంగన్వాడీ వర్కర్, గ్రామ సర్పంచ్ లు,ఎంపిటిసి,ఉన్నతాధికారులు వరకు ముక్తకంఠంతో బాల్య వివాహాలు నిర్మూలనకు అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఐసిడిఎస్.నర్సీపట్నం సిడిపిఒ.కె.మేరీ సువార్త మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మొదలు కొని అన్ని శాఖల సమన్వయంతో బాల్య వివాహాలు నిలుపుదలకు సమాజంలో విస్తృత అవగాహనా ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో నర్సీపట్నం మునిసిపల్ వైయస్ ఛైర్మెన్ కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు ఆదిలక్ష్మి, రత్నం,తహశీల్దార్ అన్నాజీరావు, మునిసిపల్ కమిషనర్ కనకారావు,ఎంపిడిఓ.జయ మాధవి,సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్,సీడ్ స్వశ్చంద సంస్థ కార్యదర్శి సన్యాసి రాజు నర్సీపట్నం,మాకవర పాలెం మండల విద్యాశాఖాధికారులు తలుపులు,పి.ఎస్.ఎన్.మూర్తి,శ్రీలక్ష్మి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అల్లూరి జిల్లా కన్వీనర్ బాకా లవకుశ, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్, చింతపల్లి మండలం కన్వీనర్ బిలాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.