Breaking News

కొయ్యూరు: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి.

0 1,555

ఆశ్రమ పాఠశాలలో మరణించిన బాలుడి మృతదేహం ఇంటికి డోర్ డెలివరీ.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం.

వార్డెన్ నిర్లక్ష్యమే కారణం అంటున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.

తమ బాలుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న విషయం కూడా తమకు తెలియజేయలేదని,చనిపోయిన తర్వాత నేరుగా ఇంటికి తీసుకువచ్చి చేతులు దులుపుకున్నారని తల్లిదండ్రుల ఆవేదన.

దీనంతటికీ కారణం వార్డెన్ మిరియాల రాజు అని చెబుతున్న బాలుడి తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు.

ఈ విషయమై విద్యార్థులను అడగగా బుధవారం రాత్రి అందరూ పడుకున్న సమయంలో సగం రాత్రికి వరండా వద్ద పడిపోయి కిల్లో వంశీకృష్ణ పెద్దగా కేకలు వేస్తూ ఏడ్చాడని కొంతసేపటికి ఒళ్ళంతా చల్లబడిపోయిందని తెలిపిన విద్యార్థులు.
పూర్తి వివరాలు చూసినట్లయితే కిల్లో వంశీకృష్ణ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం లో బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద 4వ తరగతి చదువుతున్నాడు.అయితే ఈనెల 12వ తేదీన ఆ బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు.అయితే అదే గ్రామంలో ఉన్న హాస్పిటల్ కి బాలుడిని వార్డెన్ మిరియాల రాజు తీసుకుని వెళ్ళగా బాలుడికి మలేరియా,టైఫాయిడ్ కూడా ఉందని చెప్పినట్లు డాక్టర్ తెలిపారు.అయితే తదుపరి చికిత్స కోసం బాలుడిని వై.రామవరం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని చెప్పామని ఆయన అన్నారు.అయినప్పటికీ బాలుడిని వై.రామవరం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళకుండా పాఠశాల వద్దనే ఉంచేయడంతో బాలుడు పాఠశాల వద్ద మరణించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
అయితే ఈనెల 13వ తేదీన బుధవారం రాత్రి 2గంటల సమయంలో వంశీకృష్ణ వరండా వద్ద పడిపోయి ఏడుస్తూ ఉండడంతో ఒక ఉపాధ్యాయుడు, పాఠశాల విద్యార్థులు కలిసి ఉపాధ్యాయుని రూం వద్దకు తీసుకు వెళ్లి కూర్చో బెట్టారని ఏమైందో తెలీదుగానీ పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ ఏడ్చాడని కొంతసేపటికి వంశీకృష్ణ ఒళ్ళు అంతా చల్లబడిపోయిందని విద్యార్థులు తెలిపారు.ఇంతలో హుటాహుటిన పాఠశాల ఉపాధ్యాయుడు సుబ్బారావు, కొంతమంది విద్యార్థులు కలిసి వంశీకృష్ణ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళినట్లు విద్యార్థులు తెలిపారు.అయితే ఈ విషయమై హాస్పిటల్ సిబ్బందిని వివరణ అడగగా హాస్పిటల్ కి తీసుకువచ్చే లోపే బాబు పల్స్ అంతా పడిపోయిందని, హాస్పిటల్ కి తీసుకువచ్చే లోపే బాబు మరణించాడని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
బాలుడు మరణించిన పూర్తి వివరాలు గురించి,పాఠశాల సిబ్బంది గురించి విద్యార్థులను అడగగా పాఠశాల సిబ్బంది అందరూ బాగానే చూసుకుంటారని,కానీ వార్డెన్ మాత్రం సరిగా అందుబాటులో ఉండరూ, పట్టించుకోరని తెలిపారు.అయితే బాలుడు మరణించిన రోజు కూడా వార్డెన్ పాఠశాలలో పిల్లలకు అందుబాటులో లేరని విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బాలుడి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్న విషయం కూడా వారికి తెలియజేయలేదని,14వ తేదీన ఉదయం 6గంటలకు బాలుడి స్వగ్రామం అయిన గొందికోట గ్రామానికి ఇద్దరు టీచర్లు వెళ్లి మీ బాబు కు ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వచ్చి చెప్పారని, ఇంతలో హాస్పిటల్ కి బయల్దేరి వెళుతుండగా తమకు ఎదురుగా బాలుడి మృతదేహం తీసుకు వస్తున్నారని అన్నారు.
తమ బాబుకు అనారోగ్యంగా ఉందని ముందుగా చెప్పివుంటే ఏదో రకంగా మేమే బ్రతికించుకునే వాళ్ళమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏది ఏమైనప్పటికీ సంబంధింత అధికారుల పర్యావేక్షణ కూడా లేకపోవడంతో గిరిజన విద్యార్థుల మరణాలు అధికమవుతున్నాయి అనడంలో సందేహం లేదు.బాలుడు మరణించి నాలుగు రోజులు అవుతున్నా ఇప్నటికీ ఒక్క అధికారి కూడా ఆ పాఠశాలను సందర్శించ లేదు అంటే గిరిజన విద్యార్థులు మరణాలు అంటే అధికారులకు ఎంత చులకనో అర్ధం చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.