నూతన ఫించన్లు పంపిణీ చేసిన మండల పార్టీ అధ్యక్షుడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని బకులూరు సచివాలయంలో ఈరోజు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు చేతుల మీదుగా 41మందికి నూతన ఫించన్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం,మతం,ప్రాంతం,పార్టీ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ సమ ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు.అందరికీ మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి మీ మద్దతును ఇస్తూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంకంపాలెం సర్పంచ్ పొట్టిక శ్రీను,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, ఫించన్ దారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.