Breaking News

గొందూరు అంగన్వాడీ సెంటర్లో జన భాగస్వామ్య కార్యక్రమం.

0 16

 గొందూరు అంగన్వాడీ సెంటర్లో జన భాగస్వామ్య కార్యక్రమం.

బాల్యదశలో కలిగించే ప్రేరణలే మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి.

పూర్వప్రాథమిక విద్యా కార్యక్రమాల ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించటానికి జన భాగస్వామ్య కార్యక్రమం.

-గొందూరు అంగన్వాడీ టీచర్ సాసుమల్లి చిన్నారి.

అల్లూరి జిల్లా, పాడేరు: ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో జన భాగస్వామ్య కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని అంగన్వాడీ డైరెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పాడేరు మండలం గొందూరు అంగన్వాడీ టీచర్ సాసుమల్లి చిన్నారి అంగన్వాడీ ఆయా, పిల్లల తల్లితండ్రులు, పిల్లలతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పిల్లలను పిల్లల తల్లితండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల జీవితంలో మొదటి ‘6’ సంవత్సరాలు అత్యంత విలువైనవి. మూడేళ్ల వరకు తల్లి ఒడికి, ఇంటికి పరిమితమైన పిల్లలు తర్వాత బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మొదలు పెడతారని, ఈ వయస్సులో చూసిన, విన్న అంశాల ఆధారంగా బుద్ధిని, తెలివితేటలను వికసింప చేసుకుంటారాన్నారు. కాబట్టే పూర్వప్రాథమిక విద్యను పిల్లలకు ఇష్టమైన ఆటలు, పాటలు, కథల ద్వారా వారి మనస్సుకు హత్తుకునేలా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ విద్యా ప్రభావం పిల్లల్లో ప్రాథమిక స్థాయిలోనే కాక ఉన్నత స్థాయిలో కూడా విద్యా ప్రమాణాలను అందుకునేందుకు తోడ్పడుతుందన్నారు.బాల్య దశలో కలిగించే ప్రేరణలే మనిషి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని,ప్రాథమిక స్థాయిలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సమాజంలోని వారి ప్రవర్తన పిల్లల శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసంపై ప్రభావం చూపిస్తుందన్నారు.కాబట్టి తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు అలాగే సమాజంలోని వారికి పూర్వప్రాథమిక విద్యా కార్యక్రమాల ఆవశ్యకతపై అవగాహనను పెంపొందించటానికి జన భాగస్వామ్య కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు.ఈ జన భాగస్వామ్య కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలలో చేపట్టడం జరుగుతోందని, పిల్లల సమగ్రాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రంలో చేసే వివిధ కార్యక్రమాలే కాకుండా కుటుంబ స్థాయిలో చేపట్టవలసిన వివిధ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

Leave A Reply

Your email address will not be published.