Breaking News

ఈనెల 12,13 తేదీలలో రావణాపల్లి సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

0 166

అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం: ఈనెల 12,13 తేదీలలో రావణాపల్లి సచివాలయం పరిధిలోని రావణాపల్లి,నల్లగొండ పంచాయితీ లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ తెలిపారు.ముఖ్యఅతిథిగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హాజరవుతారని ఆమె అన్నారు.ముందుగా రేపు 12వ తేదీన రావణాపల్లి పంచాయితీలోని రేవడవీధి,పాత రావణాపల్లి,రావణాపల్లి,తోటలూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,13వ తేదీన నల్లగొండ పంచాయితీలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు,ఎంపీపీ,జడ్పిటిసి,నామినేటెడ్ పదవులలో ఉన్న చైర్మన్లు,డైరెక్టర్లు,వైస్ ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచులు,బిసి కార్పొరేట్ డైరెక్టర్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు,మండల జెసిఎస్ కన్వీనర్, వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ కోరారు.

Leave A Reply

Your email address will not be published.