పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వెళ్లిన జనసైనికుడు తిరిగి వస్తున్న సమయంలో తుని లో మృతి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: బాలారం గ్రామానికి చెందిన చందక బంగారురాజు.. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరంలో పెట్టిన మీటింగ్కు వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా.. తునిలో రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని కార్ ఢీ కొట్టినట్టు తెలియవస్తుంది.ఈ ప్రమాదంలో బంగారురాజు మృతి చెందాడు. ఢీ కొట్టిన కారు ఆగకుండా వెళ్లి పోయిందని సమాచారం.ఈ ఘటనతో బాలారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.