Breaking News

కొయ్యూరు: మండల క్యాడర్ వల్ల పార్టీ పరిస్థితి ఏంటి?

0 328

•ఎమ్మెల్యే పర్యటనకు మండల ముఖ్య నాయకులు దూరం దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి?

•ఆంతర్యామేమిటోనంటూ కార్యకర్తల్లో జోరుగా చర్చనీయం.

•స్వయంగా ఎమ్మెల్యే గానీ పార్టీ క్యాడర్ గానీ కల్పించుకుంటే తప్ప కొయ్యూరు లో పార్టీకి గడ్డుకాలమే.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు: నిన్నమొన్నటి వరకు పిలిచినా పిలవకపోయినా ఎమ్మెల్యే పర్యటన ఉందంటే చాలు అదే తడవుగా పరుగులేట్టే వైసీపీ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యే పర్యటించే అధికారిక కార్యక్రమాలకు పలువురు ముఖ్య వైసీపీ నాయకులైన జడ్పీటీసీ,వైస్ ఎంపీపీలు,నామినేటేడ్ పదవులు పొందిన వారంతా ఇటీవల ఎమ్మెల్యే నిర్వహించిన అధికారిక కార్యక్రమం నకు హాజరుకావటంలేదు.మూకూమ్మడిగా అంతా ఒకేసారి రాకపోవటంతో వీరందరికి సొంత పనులుండటంతోనే రాలేదా లేక అలక బూనిన సందర్బంగా రాలేదా!అనే ప్రశ్నలు మండలంలో ఉత్పన్నం అవుతున్నాయి.ఈ ఊహించని పరిణామంపై కొయ్యూరు మండలంలో పెద్ద చర్చినీయాంశంగా మారింది.నాయకులు గైర్హాజరు కావటంపై ఇటు అధికార పార్టీతో పాటు, ఇతర రాజకీయ వర్గాల్లో చర్చనీయంశం అయ్యింది.గత నాలుగేళ్ళుగా నాయకులు,కార్యకర్తలలో నిండుగా కనిపించే వైసీపీ నాయకుల టీం ఓకేసారి శుక్రవారం నాటి కార్యక్రమంలో వారంతా కనిపించకపోవటం ఎమ్మెల్యే పర్యటనలో’కొట్టొచ్చినట్టుగా’ లోటు చోటు చేసుకోవటంతో ఈ ఊహించని పరిస్థితిపై అధికార్లు,పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తల్లో ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతుంది.ఈ నెల 8వ తేదీన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇదే కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ శివారు నిమ్మలగొంది గ్రామం నుండి జి కే వీధి మండల సరిహద్దు వరకు 7.5కిలోమీటర్లు గల రోడ్డుకు 2.50కోట్ల తో నిర్మించే గ్రావెల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పాల్గొనే ప్రధానమైన శంకుస్థాపన కార్యక్రమం నకు ఎప్పటిలాగే పాల్గొనేటట్టు వచ్చే ప్రధాన నాయకులైన జడ్పీటీసీ,ఇద్దరు వైస్ ఎంపీపీ లతో పాటు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,నామినేటేడ్ పదవులు పొందిన వారు,కార్యకర్తలతో సైతం ఈ కార్యక్రమంనకు మూకూమ్మడిగా హాజరు కాక పోవటం పట్ల సర్వత్రా ఒక్కింత చర్చించుకోవడం మొదలైయింది..అల్లూరి జిల్లా కొయ్యూరు మండల వైసీపీ పార్టీలో ఇంతవరకు ఓకే టీం,ఓకే వర్గంగా కొనసాగుతున్న వైసీపీ నాయకుల ఐక్యత జిల్లాలోనే బలమైన టీం గా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే.అలాంటిది ఒకేసారి అందరికి ఆశ్చర్యం కలిగేలా శుక్రవారం నాటి ఎమ్మెల్యే పర్యటన శంకుస్థాపన కార్యక్రమంలో సగం టీం హాజరుకాకపోవటంపై ఆంతర్యం ఏమిటనే చర్చ ప్రశ్నలతో ఈమధ్య ఆ నోటా ఈ నోటా విపిస్తుస్తుండటం ప్రచారం సాగుతుంది.వాస్తవానికి కొంతకాలంగా ఈ మండలం లోని వైసీపీ పార్టీలో నాయకుల మధ్య కొంత అంతర్గత విభేదాలు ఉన్నాయనే మాట లోలోపల లేకపోలేదు.అయితే ఇది పెద్ద విశేషేమేమి కాదని సహజంగా ఉండేదేనని చెప్పుకుంటున్నప్పటికీ శుక్రవారం నాటి పరిస్థితి ఒక్కసారిగా మారటంతో ఏదో పరిణామం చోటు చేసుకున్నట్టు అనుకుంటున్నారు.కొయ్యూరు మండలంలో నెలలో ఏదో చోట ఒక అధికారిక ప్రోగ్రాం లో అన్నీ మర్చి ఏ ఒక్కరి వద్ద బయట పడకుండా ప్రజల్లో,కార్యకర్తల్లో యధావిధిగానే ఎమ్మెల్యే నిర్వహించే ప్రోగ్రాం తోపాటు,మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీ కలిసి ఏర్పాటు చేసే సభలు,సమావేశాలకు వీరంతా నిన్న మొన్నటి వరకు హాజరువుతున్న పరిస్థితి కొనసాగిస్తున్నారన్నది అందరికి తెలిసిందే.ఇటు అధికారులకు, అటు వైసీపీ టీం లో కూడా ఎక్కడా ఎటువంటి భేదాభిప్రాయాలు ఉనట్టు కనిపించలేదనేదే అందరి అభిప్రాయం.అయితే ఒక్కసారిగా నిమ్మలగొంది లో ఎమ్మెల్యే నిర్వహించిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో అతి ముఖ్యులైన జడ్పీటీసీ,ఇద్దరు వైస్ ఎంపీపీలతో పాటు,నామినేటెడ్ పదవులున్న చైర్మన్,డైరెక్టర్లు ఇతర ఎంపీటీసీ లు,సర్పంచ్ లతో సహా ఎప్పుడూ కనిపించే వారే హాజరు కాకపోవటం పట్ల పార్టీ నాయకుల మధ్య ఇదేదో బ్రహ్మాండం బద్ధలైనట్టుగానే ప్రచారం సాగుతుంది. నాలుగున్నరేళ్లుగా కొయ్యూరు మండల వైసీపీ పార్టీలో లేని లోటు చోటు చేసుకోవటం పట్ల సర్వత్రా చర్చ సాగుతుంది.కొందరు వైసీపీ నాయకులు అయితే అలాండిదేమి లేదు అంటున్నారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓకే మాట..ఒకే బాటగా కంచుకోటగా ఉండే ఈ మండలంలో వేర్పాటు ధోరణి కనిపిస్తుందన్న మాట ప్రచారం ఉంది.ఇది ఎంతదూరం పోతుందోననే మాట ఆ పార్టీ నాయకుల్లోనే వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు అనుకుంటున్నారు.వైసీపీ పార్టీకి బాగా బలం ఉన్న కొయ్యూరు మండలంలో ఇదే పరిస్థితి కొనసాగితే 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో
మండలంలో పట్టు తగ్గటం ఖాయం అనే మాట వినిపిస్తుంది.ఇప్పటికే కొయ్యూరు మండలంలో వైసీపీ పార్టీలో నాయకుల మధ్య తలెత్తిన అంతర్గత విబేధాలు,ప్రోటోకాల్ ఫిర్యాదుపై దుమారం,తగిన గుర్తింపు లేదనే నాయకుల వాదనల నేపథ్యంలో ఈ మండల నాయకుల మధ్య చోటు చేసుకున్న విబేధాలు ఏ దశకు చేరుతుందో వేచి చూడాలి మరి.అయితే కొయ్యూరు మండలంలో పార్టీ నాయకుల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు విడనాడాలన్నా,పార్టీకి మునుపటిలా పూర్వ వైభవం కలగాలన్నా నాయకులు అన్నీ మరచిపోయి అంతా కలిసి కట్టుగా ముందుకు వెళితే తప్ప,లేదంటే స్వయంగా నియోజకవర్గ ఎమ్మెల్యే లేదంటే పార్టీ క్యాడర్ కల్పించుకుంటే తప్ప కొయ్యూరు మండలంలో వైసీపీ పార్టీకి గడ్డుకాలమే అనడంలో సందేహం లేదు.

Leave A Reply

Your email address will not be published.