Breaking News

భారత అంధుల క్రికెటర్ రవణి ని ఘనంగా సన్మానించిన అరకు ఎమ్మెల్యే.

0 277

భారత అంధుల క్రికెటర్ రవణి ని ఘనంగా సన్మానించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ.

భారత మహిళల అంధుల క్రికెట్‌ జట్టు కొత్త చరిత్ర లిఖించింది.ఐబీఎస్‌ఏ(ఇంటర్నేషనల్‌ బ్లైండ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌) వరల్డ్‌ గేమ్స్‌లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టు తరఫున అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు నియోజకవర్గం,హుకుంపేట మండలం, మెరకచింత గ్రామ పంచాయతీ రంగసింగ పాడు గ్రామ ఆదివాసి గిరిజన ముద్దు బిడ్డ వలసనైనీ రవణి బరిలో దిగి ఉత్తమ ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచి అందుల క్రికెట్ లో అలరించింది.

ఈరోజు రవణి స్వగ్రామం లోని ఆమె యొక్క స్వగృహమునకు ప్రజా ప్రతినిధులు వైసిపి నాయకులతో పాటుగా వెళ్లి అభినందించి ఘనంగా సన్మానించి రవణికి ఆర్థిక సహాయం అందించి మరెన్నో పోటీలలో అంతర్జాతీయ స్థాయిలో అరకు గిరిజన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆశీర్వదించిన అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే
చెట్టి ఫాల్గుణ.

ఈ యొక్క సందర్భంగా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ
అంధులైతేనేం..ఈ ప్రపంచాన్ని ఆమె యొక్క మనోనేత్రంతో జయించింది. అంగవైకల్యం ప్రతిబంధకమైనా..తాము ప్రతిభలో ఎవరికి తీసిపోనని రవణి ఘనంగా చాటిచెప్పింది. ప్రోత్సహిస్తే చాలు పతకాలతో దేశం అలాగే గిరిజన ప్రాంత కీర్తి,ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేస్తామని చేతల్లో చూపించింది అన్నారు.
వైకల్యం అడ్డంకిగా మారినా మెండైనటువంటి ఆత్మవిశ్వాసంతో యావత్తు దేశం గర్వపడేలా తమదైన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. తొలిసారి జరిగిన మహిళల అంధుల క్రికెట్‌లో సత్తాచాటుతూ రాష్ట్రం అలాగే మన గిరిజన ఖ్యాతిని ఇనుమడింపజేసింది అన్నారు.ఇంగ్లండ్‌,ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ అప్రతిహత విజయాల్లో రవణి కీలకంగా వ్యవహరించి బ్రిటిష్‌ గడ్డపై చరిత్ర లిఖించి మన ఆదివాసి గిరిజన (అరకు) ప్రాంత ప్రతిష్టను ప్రపంచానికి చాటి చూపించింది అన్నారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని గిరిజన ప్రాంత క్రీడాకారులు చైతన్యవంతం కావాలని ఆశిస్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈమెను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమె కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు అల్లూరి జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పాంగి సింహాచలం,అల్లూరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు ఒంటుబు శామ్యూల్,స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ దూసురు పద్మకుమారి,హుకుంపేట మండల పిఎసిఎస్ చైర్మన్ & మండల జేసిఎస్ కన్వినర్ కిల్లో రామక్రష్ణ,మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు కాకరి బొంజుబాబు,హుకుంపేట మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు గెమ్మెలి కొండబాబు,వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు,సూపర్ సర్పంచులు, గుమ్మ శ్యాంసుందర్,నైని సన్నీబాబు,దూసురు వెంకట్,కొప్పుల లక్ష్మయ్య,ధనసాని మురళి,వైసిపి పార్టీ సీనియర్ నాయకులు, సచివాలయం కన్వినర్స్ తాంగుల పద్మారావు,చప్పలి మహేష్,చిన్నేశ్వరరావు,గెమ్మెలి కృష్ణారావు,
గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.