Breaking News

పాడేరులో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సామూహిక నిరాహార దీక్షలు.

0 231

•రాష్ట్రాన్ని కాపాడండి-రౌడీ రాజకీయాలని ఖండించండి.

•చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణం.

•ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు.

•పాడేరులో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సామూహిక నిరాహార దీక్షలు.

•జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది.

•తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది చంద్రబాబు.

-పాడేరు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

అల్లూరి జిల్లా,పాడేరు: జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని,తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది చంద్రబాబు అని,దేశంలో ఏ ఒక్కరిని అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారని,పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా సామూహిక నిరాహార దీక్షలు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ను స్కిల్ స్కాం కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని, రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పని అన్నారు.ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోయే వ్యక్తి కాదు,చంద్రబాబు ఎక్కడో దాక్కునే వ్యక్తి కాదని,కనీసం గవర్నర్ కి తెలియకుండా అక్రమ అరెస్టులు చేయడం ఇది కక్ష సాధింపు చర్యే అని అన్నారు.అనేకమంది ఐదేళ్లు స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టుతో ఉద్యోగాలు పొందారని,రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారన్నారు.ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలని,చట్టం లేదు,న్యాయం లేదు,ధర్మం లేదు,కేవలం రాజకీయ కక్షతోనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టారన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కంటే జగన్ కు ప్రతీకార వాచన ముఖ్యమని రెండేళ్లు క్రితం నుంచి చంద్రబాబును విచారణకు ఎందుకు పిలువ లేదని పోలీస్ రాజ్యంలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కక్ష సాధింపుల పాలన కొనసాగుతుందని,ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారని,ఏపీలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగటం లేదని అన్నారు.ఏపీలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని,గవర్నర్ అనుమతి లేకుండానే చంద్రబాబును అరెస్టు చేయడం ఏమిటో చాలా విడ్డూరంగా ఉందన్నారు.చంద్రబాబును విడిచి పెట్టేంత వరకు పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సోమేలి చిట్టిబాబు,రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడి సింహాచలం,రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి కొట్టగుల్లి రమేష్ నాయుడు,రాష్ట్ర మహిళా కార్యదర్శి బొర్రా విజయలక్ష్మి,మాజీ జెడ్పి చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ,అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగపూజ శివకుమార్,రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్,ఐ టి డి పి ఇన్చార్జ్ బుద్ధ జ్యోతి కిరణ్,దారేలా సర్పంచ్ పాంగి పాండురంగస్వామి,డప్పోడి వెంకటరమణ,అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ మహిళ కార్యదర్శి డిప్పల.వెంకట కుమారి,ఎంపీటీసీ గూడెపు ఉషారాణి,వర్తన వరలక్ష్మి,బొడ్డెటి వరలక్ష్మి,కొయ్యురు మండల పార్టీ కార్యదర్శి తోట వీర సత్యనారాయణ,ఎంపీటీసీ భానుమతి, సీనియర్ నాయకులు కొండపల్లి పిన్నయ్య దొర,సర్పంచ్ కృష్ణమూర్తి,కిల్లో రాధాకృష్ణంనాయుడు,పాటి భీంబాబు,జి మాడుగుల,పాడేరు మండల అధ్యక్షులు కూడి రాంనాయుడు,కొండలరావు,బర్శింగి శ్రీను,కిల్లో చంద్రమోహన్ నాయుడు,వాసం రాంబాబు,లకే రామకృష్ణ,సర్పంచ్ సింహాచలం,వంజరి చిరంజీవి నాయుడు,కొండపల్లి నితిన్,రేగం కొండబాబు,మాజీ ఎంపీటీసీ పలాసి శోభన్,కిల్లో అప్పల నాయుడు,కర్రిదొర,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.