Breaking News

గిరిజన ప్రాంతంలో చేపల చెరువులు మంజూరు చేసిన జగన్ మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేసిన అర్జున్ రెడ్డి.

0 239

గిరిజన ప్రాంతంలో చేపల చెరువులు మంజూరు చేసిన జగన్ మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేసిన అర్జున్ రెడ్డి.


అల్లూరి సీతారామరాజు జిల్లా,హుకుంపేట మండలం:అరకువేలి నియోజకవర్గంలో ఆంధ్ర-ఈఒరిస్సా రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే రహదారిలో రహదారి పొడవునా చేపల చెరులను తలపిస్తున్నాయని సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అన్నారు.
అరకువేలి ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పట్టుదలతో చెరువులను మంజూరు చేయించారని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధికంగా ఉన్నటువంటి ప్రాంతం చేపల చెరువులు.. చేపలు లేకపోయినా చెరువులు మాత్రం పుష్కలంగా ఉన్నాయని అర్జున్ రెడ్డి అన్నారు.
రోజూవారీ వందలాది,వేలాది మంది ప్రయాణం చేసే రహదారి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా ఈనాటికి అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం ప్రజలకు సరైన రహదారి సౌకర్యం,వైద్యం,విద్యా లేకపోవడం చాలా బాధాకరం అన్నారు.
వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారిలో ప్రయాణికుల ఇబ్బందులను వర్ణించలేమని అర్జున్ రెడ్డి అన్నారు.
ఈ రహదారిని హుకుంపేట మండల చుట్టుపక్కల ప్రజలు,ప్రయాణికులు తక్షణమే నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు.
అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ,సంబంధిత అధికారులు వెంటనే రహదారి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.