Breaking News

ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ ఆహార సంబంధ వ్యాపారులు తప్పనిసరిగా తీసుకోవాలి.

0 383

ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ ఆహార సంబంధ వ్యాపారులు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్:(ఫోస్టాక్)వంజి బాబా గ్రామీణ వికాస్ మండల్ ఎన్జీఓ ట్రైనింగ్ పార్ట్నర్ గా ఐదు రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ వారు ఆంధ్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ గా గరికి అరుణ కుమార్ ని నియమించారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని జిల్లాలలో ఫుడ్ సేఫ్టీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ని,జిల్లా ఆహార భద్రత సమన్వయకర్త,జిల్లా ప్రధాన పట్టణాలు,నియోజకవర్గ,మండలాల వారిగా నియమించినట్లు తెలిపారు. వారు ప్రతిరోజు ఆహార సంబంధమైన వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ పరిశుభ్రమైన నాణ్యమైనటువంటి,హానికరం కానటువంటి,ఆహార ఉత్పత్తులు ప్రజలకి అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫోస్టెక్ శిక్షణ అలాగే సర్టిఫికెట్ హోటల్స్,రెస్టారెంట్స్,బేకరీ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్,కిరాణా దుకాణాలు,కూల్ డ్రింక్ షాప్స్,టి హోటల్స్,చికెన్ అండ్ మటన్ వ్యాపారులు,సూపర్ మార్కెట్,కూరగాయల దుకాణాలు,వీధి వ్యాపారులు అందరూ ఫో స్ట్రోక్ ట్రైనింగ్ ఖచ్చితంగా పొందవలెనని ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గా ప్రతి జిల్లాలో ఈ ఫుడ్ సేఫ్టీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ని నియమిస్తున్నామని వ్యాపారస్తులు తప్పకుండా సహకరించాలని,అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.