Breaking News

వైసిపి పార్టీలో మరొకసారి అంతర్గత విభేదాలు బట్టబయలు.

0 447

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో వైసిపి పార్టీలో మరొకసారి అంతర్గత విభేదాలు బట్టబయలు.

గిరిజన మహిళ అయిన తనను రాజకీయంగా కొందరు అణచి వేయాలని చూస్తున్నారని చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ వెల్లడి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా కొయ్యూరు మండలంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమంలో నాయకులు అందరూ ఒక చోట,నలుగురు నాయకులు మాత్రం ఓటర్లతో ఒక చోట.
పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అనేక కార్యక్రమాల్లో,అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల పక్షపాతి అని సంబోధించడం జరిగింది.
కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే కొయ్యూరు మండలంలో దానికి భిన్నంగా ఉందని సొంత వైసీపీ పార్టీ సీనియర్ నాయకురాలు, చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ తెలిపారు.
పూర్తి వివరాలు చూసినట్లయితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గత కొంతకాలంగా పార్టీ ముఖ్య నేతలకు మధ్య అంతర్గత విభేదాలు చోటుచేసుకున్నాయి.
అయితే ప్రతి యేటా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి,వర్థంతి కార్యక్రమాలకు ముఖ్య నాయకులు అందరూ నల్లగొండ లోనే హాజరవుతారు.
కానీ ఈరోజు జరిగే వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమానికి మాత్రం జడ్పిటిసి వారా నూకరాజు,డౌనూరు ఎంపిటిసి బిడిజన అప్పారావు,రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి హాజరు అయ్యారు.
ఈ క్రమంలో మిగతా నాయకులు హాజరవకకోవడానికి గల కారణాలు ఏఎంసీ చైర్పర్సన్ జైతి రాజులమ్మను అడగగా ముఖ్య నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు వెల్లడించారు.
కొయ్యూరు మండలంలో మాత్రం గిరిజనులు ఎవరూ రాజకీయంగా ఎదిగేందుకు అవకాశాలు ఉండవని,ఏదో ఒక రకంగా కొంతమంది రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు జరుపుతూ ఉంటారని తెలిపారు.
చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న తన విషయంలోనే కొంతమంది అధికారులతో మండల నాయకులు కలిసి ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి, అలాగే వైసీపీ పార్టీ పెద్దలు అయిన వైవి సుబ్బారెడ్డికి, విజయసాయి రెడ్డికి కూడా నేరుగా వెళ్లి తెలియజేయునన్నట్లు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.