Breaking News

మారుమూల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన మంప,వై.రామవరం ఎస్సైలు.

0 59

మారుమూల మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన మంప, వై.రామవరం ఎస్సైలు.

మారుమూల మావోయిస్టు ప్రభావిత యు.చీడిపాలెం పంచాయితీ లోని గ్రామాలైన తీగలమెట్ట,గొల్లలబంధ, నీలవరం,గంగవరం,తాళ్ల ఎర్రగొండ అలాగే వై.రామవరం మండలంలో గల దదలికవాడ గ్రామాన్ని మంప ఎస్ఐ లోకేష్ కుమార్,వై.రామవరం ఎస్ఐ సంతోష్ కుమార్ సందర్శించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. అలాగే వారి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు.అలాగే మావోయిస్టుల కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మావోయిస్టులకు సహకరించి మీ అభివృద్ధిని మీరు దూరం చేసుకోవద్దని అన్నారు.అలాగే గంజాయి సాగు, రవాణా వంటి విషయాలకు దూరంగా ఉండాలని అన్నారు.మూడ నమ్మకాలు కూడా నమ్మోద్దని అన్నారు.ప్రభుత్వం సహకారంతో పోలీసు వారు చేస్తున్న అభివృద్ధి పనులు కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది.
గ్రామస్తులందరికీ వాళ్లకు కావాల్సిన మెడిసిన్,యువతకు వాలీబాల్ కిట్లు, పిల్లలకు చాక్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.