Breaking News

సచివాలయ వ్యవస్థతో పాలనలో వినూత్న మార్పులు-పాడేరు ఎమ్మెల్యే

0 86

సచివాలయ వ్యవస్థతో పాలనలో వినూత్న మార్పులు.

కొమ్మిక సచివాలయం,రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.

గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ వినూత్న ఆలోచన వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు అని అన్నారు. ఈ వ్యవస్థతో పాలన ప్రజలకు మరింత చేరువైందన్నారు. చాలా పారదర్శకమైన విధానంలో సంక్షేమ పథకాలు అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య ఎదురైనా దాని పరిష్కారం కోసం మండల కేంద్రాలకో,నియోజకవర్గ కేంద్రాలకో వెళ్లాల్సిన పరిస్థితి నుంచి ఈ సచివాలయ వ్యవస్థ ఉపశమనం కలిగించిందన్నారు. గ్రామంలో ఏ పౌరుడికి ఏ అవసరం ఏర్పడినా తీర్చేందుకు సచివాల వ్యవస్థ ఒకటే వేదికన్నారు. 2000 మంది జనాభాకో సచివాలయం ఏర్పాటు చేయడం నిజంగా శుభ పరిణామమన్నారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. సచివాలయానికి అనుబంధంగానే వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడిని రాబట్టేందుకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, వారి భూములకు భూసార పరీక్షలు కావాలన్నా ఇలా ప్రతి విషయంలోనూ అన్నదాతకు అండగా నిలుస్తున్నది రైతు భరోసా కేంద్రాలు మాత్రమేనన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సెగ్గే సూరిబాబు,ఎంపీటీసీ అర్జమ్మ, ఎంపీపీ రమేష్, జెడ్పిటిసి నూకరాజు, ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి, మండల కన్వీనర్ బండి సుధాకర్, వైస్ ఎంపీపీ వెంకటరమణ, మండల ప్రెసిడెంట్ జల్లి బాబులు, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, ట్రైకార్ డైరెక్టర్ ఎస్ లోవరాజు,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,కంఠారం వైస్ సర్పంచ్ వనుం బాబు ,ఏఎంసి డైరెక్టర్ అచ్యుత్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసలి నాయుడు,ఎంపిటిసి మల్లేశ్వరి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గంగాధర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.