Breaking News

అధికారుల తీరుపై ఏఎంసి చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మండిపాటు.

0 441

•చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మకు ఘోర అవమానం.

•ప్రోటోకాల్ మరిచిన అధికారులు.

•అధికారుల నిర్లక్ష్యమా? ప్రజా ప్రతినిధుల స్వార్థపూరిత ఆలోచన?

•అధికారుల తీరుపై ఏఎంసి చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మండిపాటు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రజాప్రతినిధుల స్వార్థమో తెలియదు కానీ చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ కు మాత్రం అనేక సందర్భాల్లో ఘోర అవమానం జరుగుతూనే ఉంది.గత టిడిపి ప్రభుత్వంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొనసాగిన దుచ్చరి చిట్టిబాబు ను గతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాల వద్ద ప్రోటోకాల్ ప్రకారం చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ పేరును తప్పకుండా శిలాఫలకంపై ఉండేటట్లు ప్రోటోకాల్ పాటించేవారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏఎంసి చైర్మన్ గా కొనసాగిన జల్లి హలియా రాణి పేరును కూడా శిలాఫలకంపై ఉండేటట్లు అధికారులు ప్రోటోకాల్ పాటించారు. ఎప్పుడైతే చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా జైతి రాజులమ్మ ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుండి జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అయినా శిలాఫలకం పై మాత్రం జైతి రాజులమ్మ పేరును తప్పిస్తూనే వస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమా? లేక రాజకీయంగా ప్రజాప్రతినిధుల స్వార్థపూరిత ఆలోచన?
అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొమ్మికలో పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ప్రారంభించడం జరిగింది. అయితే సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై గాని,రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై గాని చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ పేరు మాత్రం లేనేలేదు. ఈమె కన్నా ముందు ఏఎంసీ చైర్ పర్సన్ గా కొనసాగినటువంటి వాళ్ల పేర్లు ప్రతీ శిలాఫలకంపై ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఏఎంసీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న జైతి రాజులమ్మ పేరును ఏర్పాటు చేయకపోవడానికి గల కారణం ఏమిటో గానీ అర్థం కాని పరిస్థితి.ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అసలు ఏఎంసి చైర్పర్సన్ గా నేను ఉన్నట్టా లేనట్టా అని అధికారులపై జైతి రాజులమ్మ భావోద్వేగంతో మండిపడుతున్నారు. చింతపల్లి,జీ.కె వీధి,కొయ్యూరు ఇలా మూడు మండలాల్లో చాలా చోట్ల ప్రోటోకాల్ ప్రకారం హాజరవుతున్నప్పటికీ శిలాఫలకాలపై ఆమె పేరు ఎక్కడా లేదన్నారు. గతంలో ప్రోటోకాల్ పాటించిన అధికారులు ఇప్పుడెందుకు పాటించడం లేదని ఆమె ప్రశ్నించారు.పార్టీ ఆవిర్భావం కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఉన్నానని,7-01-2011 లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పుటి నుండి ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు పార్టీ బలోపేతం చేసేందుకు కష్టపడి పని చేస్తూనే ఉన్నానని, వైసిపి పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్న తనకు ఎట్టకేలకు చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా అవకాశం వచ్చి కొనసాగుతున్నప్పటికీ అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కుమ్మకై కావాలనే తన గుర్తింపును అడ్డుకుంటున్నట్లు తాను భావిస్తున్నానని అన్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.