Breaking News

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి అభినందనలు తెలిపిన వైసిపి నేతలు.

0 111

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి అభినందనలు తెలిపిన వైసిపి నేతలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా మరొకసారి నియమితులైనటువంటి పాడేరు నియోజకవర్గం శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని ఆదివారం పాడేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ,కొండ గోకరి సర్పంచ్.. కొయ్యూరు మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముసలి నాయుడు,నూతన జిల్లా కమిటీలో స్థానం సంపాదించుకున్న అల్లూరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలాపు సూరిబాబు,మరొక జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ ఎమ్మెల్యే ని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతనంగా నియమితులైన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రీమల గంగాధర్,నీలాపు సూరిబాబు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలు.. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి శాలువాతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసే వారికి పదవులు వాటి అంతట అవే వరిస్తాయని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.