ఏపీఎస్సిపిసీఆర్ సభ్యులు సీతారాం ఆదేశాలతో యుద్ధప్రాతిపదిక చర్యలు భేష్:సీఆర్పీఎఫ్
అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎస్సిపిసీఆర్)సభ్యులు గొండు సీతారాం ఈ నెల 21 న అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పర్యటనకు విచ్చేసారు.కాకరపాడులోని గురుకుల కళాశాలను సందర్శించారు.అక్కడి విద్యార్థులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.వారు అనుభవిస్తున్న,ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు.
మరుగుదొడ్లు నిర్వహణ అసలు పట్టించుకోకపోవడం,తలుపులు విరిగిపోవడం,నీటి సదుపాయాలు లేకపోవడం,పరిసర ప్రాంతాల్లో మొక్కలు భారీగా పెరగడంపై అసహనం వ్యక్తం చేశారు.వారం రోజుల్లోగా నిర్వహణ,మరమ్మత్తులు చేపట్టి శత శాతం వీటిని అందుబాటులోకి తేవాల్సిందేనని లేకుంటే చర్యలు చేపట్టేందుకు కమిషన్ సిద్ధంగా ఉందన్న ఆదేశాలును సంభంధిత అధికారులతో ఫోన్ లో జారీ చేశారు.
సీతారాం ఆదేశాలతో ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని ఈ క్లిష్ట సమస్యకు 5 రోజుల్లోనే పరిష్కారం కావడంతో విద్యార్థుల మోముల్లో ఆనందాన్ని నింపడం హర్షదాయకమని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ డాక్టర్ బాకా లవకుశ,కొయ్యూరు మండల కన్వీనర్ అచ్యుత్ అన్నారు.
శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వీరు మాట్లాడుతూ కె.జి.బి.వి.పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు,బాలల హక్కులను ఉల్లంఘించి ప్రతీ రోజు రాత్రులు ఎందుకు విద్యార్ధినులను తీసుకెళుతున్నారో,ఉపాధ్యాయులు ఇష్టానుసారం ఆలస్యం,డుమ్మా కొట్టడంపై వివరణ ఇవ్వాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సత్వరమే విద్యార్థులను పంపించకుండా చర్యలు చేపట్టడం,ఉపాధ్యాయులు సమయానికి విధుల్లోకి హాజరౌతామని అధికారులకు లిఖితపూర్వకంగా వ్రాసివ్వడం బాలల హక్కుల విజయంగా భావిస్తున్నామని అన్నారు.అలాగే కే జి బి వి పాఠశాల,కాకరపాడు గురుకుల కళాశాల మెను అమలు తీరు తెన్నులు,కోడి గుడ్లు బరువు,నాణ్యతలపై అసహనం వ్యక్తం చేయడం,కాంట్రాక్టర్లు తీరు మార్చుకోకుంటే బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరికలు జారీచేయడం, బాయ్స్-2 వార్డెన్ నిత్యం విధులకు డుమ్మా కొడుతున్నట్టు విద్యార్థులు ఫిర్యాదు అందించడంతో ఆయనపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సీతారాం సిఫారసులు చేయడం గిరిజన బిడ్డల విజయమని అన్నారు.
కమిషన్ సభ్యులు సీతారాం చేపట్టిన పర్యటనల మాదిరిగా జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి బాలలు,విద్యార్థుల హక్కులు పరిరక్షణకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని లవకుశ,అచ్యుత్ తెలిపారు.
Prev Post