Breaking News

కందిరీగల దాడిలో బాలుడు మృతి.

0 472

కందిరీగల దాడిలో బాలుడు మృతి.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,బూధరాళ్ల పంచాయితీ లోని పిట్టల పాడు గ్రామానికి చెందిన కొర్రా శోభన్,ధీవిత లకు చెందిన మూడు సంవత్సరాల బాలుడు కొర్రా జగన్ ఈరోజు కందిరీగల దాడిలో మరణించాడు. ఈరోజు పొలం పనులకు వెళ్లిన శోభన్,ధీవిత.. వాళ్ల బాబు నిద్రిస్తున్నాడని గమనించి మరణించిన బాబు నాయనమ్మను తోడుంచి పనులలో నిమగ్నమయ్యారు.ఇంతలో ఎటువైపు నుంచి వచ్చాయో తెలియదు కానీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అనుకోకుండా కుండ కందిరీగలు బాబును కుట్ట సాగాయి. నాయనమ్మ అయిన రాధమ్మ కు చెవిటి వల్ల గమనించుకోలేకపోయింది. ఇంతలో రాధమ్మకు కూడా రెండు,మూడు కుండ కందిరీగలు కుట్టడంతో బాబును కందిరీగలు కుడుతున్నట్లు గమనించని రాధమ్మ జగన్ ను వదిలేసి అక్కడ నుండి పరుగులు తీసినట్లు గ్రామస్తులు తెలిపారు.దీంతో జగన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.దీంతో హుటాహుటిన గ్రామస్తులు 108 కి కాల్ చేసినప్పటికీ స్పందించక పోవడంతో సుమారుగా గంటన్నర వ్యవధిలో పెదవలస పిహెచ్సికి ద్విచక్ర వాహనంలో తీసుకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే పెదవలస పిహెచ్సిలో బాబుకు పట్టించడానికి టానిక్ ఇచ్చారని తెలిపారు. పరిస్థితి తీవ్రతరంగా ఉండటంతో పెదవలస పిహెచ్సి సిబ్బంది చింతపల్లి పీహెచ్సీకి రిఫరల్ రాసినట్లు తెలిపారు. దీంతో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని పెదవలస పీహెచ్సీ సిబ్బందిని అడిగినప్పటికీ అంబులెన్స్ రిపేర్ లో ఉందని సమాధానం చెప్పారని గ్రామస్తులు తెలిపారు.దీంతో చేసేదేమీ లేక అక్కడినుండి చింతపల్లి పీహెచ్సీకి వర్షంలోనే తడుస్తూ ద్విచక్ర వాహనం ద్వారా తీసుకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. నాలుగు గంటలకు చింతపల్లి పీహెచ్సీకి తీసుకువెళ్తే సాయంత్రం 6 గంటలకు మూడు సంవత్సరాల కొర్రా జగన్ తుది శ్వాస విడిచాడని గ్రామస్తులు తెలిపారు. గత కొంతకాలంగా పెదవలస పీహెచ్సీలో అంబులెన్స్ ఉన్నప్పటికీ రిపేర్ లో ఉందని అంటున్నారని,ఒకవేళ నిజంగా రిపేర్ లో ఉంటే అంబులెన్స్ ను రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకువచ్చినట్లైతే మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల ప్రాణాలు కొంతవరకైనా కాపాడిన వారు అవుతారని కనుక అంబులెన్స్ ను రిపేర్ చేయించాలని అధికారులను వారు కోరుతున్నారు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బాబు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.