Breaking News

తరలించేందుకు సిద్ధంగా ఉన్న అక్రమ కలప స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు.

0 260

•అటవీశాఖ అధికారులు దాడులు.

•20 టేకు దుంగలు 1 గుమ్మిడి దుంగ స్వాధీనం.

•గొలుగొండ సెక్షన్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో డిపో కు తరలింపు.

అల్లూరి జిల్లా: కొయ్యూరు మండలం కంఠారం,డేగలపాలెం గ్రామాల సమీపంలో 20 టేకు దుంగలను ఒక గుమ్మిడి దుంగ గొలుగొండ సెక్షన్ అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం తమ సిబ్బందితో దాడులు చేసి స్వాధీనం చేస్తున్నారు.
టేకు దుంగలపై అధికారులు గ్రామంలో విచారణ చేపట్టగా ఎవరో కొందరు వ్యక్తులు కలప నిల్వ చేసి ఉంచారని వారి వివరాలు తెలియకపోవడంతో..
ప్రత్యేక వాహనంలో 20 టేకు దుంగలను ఒక గుమ్మిడి దుంగను గొలుగొండ అటవీశాఖ డిపోకు తరలించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా లక్ష రూపాయలు విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నామని,విచారణ చేపట్టి అనుమతులు లేకుండా సెక్షన్ పరిధిలో టేకు కలపను తరలించేందుకు నిల్వ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లక్ష్మణ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.