అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కి సంబంధించి నూతన కమిటీని నియమించడం జరిగింది.ఈ క్రమంలో మరలా రెండవసారి జిల్లా అధ్యక్షురాలుగా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని జిల్లా అధ్యక్షురాలుగా నియమించి కొనసాగించడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో కొయ్యూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రీమల గంగాధర్,నీలాపు సూరిబాబు లను జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా నియమించడం జరిగింది.తమకు జిల్లాస్థాయిలో స్థానం కల్పించినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పాడేరు నియోజవర్గం శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కి,అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి కి,కొయ్యూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల టీం కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రీమల గంగాధర్,నీలపు సూరిబాబు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయకులు,కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేసేందుకు పని చేస్తామని,మరల రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైయస్సార్ జెండా ఎగురవేసేందుకు కష్టపడి పనిచేస్తామని అన్నారు.