•బంగారంపేట పంచాయితీలో కొయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆత్మీయ సమావేశం.
•పార్టీ బలోపేతానికై వ్యూహరచన
•నియోజక వర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడమే ధ్యేయంగా కార్యకర్తలంతా పనిచేయాలని సూచనలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు మండలం బంగారంపేట పంచాయితీలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి పార్టీ క్రియాశీలక కార్యకర్తలు హాజరై పార్టీని పూర్వ వైభవం దిశగా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేదానిపై వ్యూహరచన చేసారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో క్రియాశీల కార్యకర్తలంతా ఒకే తాటిపైకి వచ్చి ఇక్కడ ఉన్న వర్గ నాయకత్వానికి అతీతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేదానిపై చర్చించారు.ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి అనేది పార్టీ చూసుకుంటుంది కానీ మనమంతా వర్గ రాజకీయాలు విడనాడి పార్టీని ఏ విధంగా బలోపేతం చేసి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరేలా చూడాలో అది చూసుకోవాలని పలువురు కార్యకర్తలు మాట్లాడారు.ఈ సమావేశంలో కొయ్యూరు మండల క్రియాశీల కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఈ ఆత్మీయ సమావేశంలో ఏ ఒక్కరూ నాయకుల పేర్లు ప్రస్తావించకపోవడంపై పలువురు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో పాడేరులో తెలుగుదేశం విజయకేతనం ఎగరడం ఖాయమని ప్రతిన పూనారు.అదేవిధంగా గ్రామస్థాయి నుంచి ఓటరును చైతన్య పరిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలు చర్చించారు.