Breaking News

ఈ నెల 20న కొండగోకిరిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు- కొండ గోకిరి దత్త పుత్రుడు మురళీ కృష్ణ.

0 18


ఈ నెల 20వ తేదీన అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కొండ గోకిరిలో తోడు ది లోకుల గాంధి ట్రస్ట్ నర్సీపట్నం అమ్మ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉజ్వల మల్టీ రీఛార్జ్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లోకుల రమేష్,అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ జి.వి రాజు, గోకిరి దత్తపుత్రుడు మురళీ కృష్ణ సంయుక్తంగా తెలియజేశారు.ఈ సందర్భంగా అమ్మ హాస్పటల్ అధినేత డాక్టర్ జి.వి రాజు మాట్లాడుతూ గిరిజన ప్రజల అవసరాల కోసం లోకుల గాంధీ ట్రస్ట్,అమ్మ హాస్పటల్ అలాగే ఉజ్వల మల్టీ రీఛార్జ్ వారి సహకారంతో మథర్ బ్లడ్ బ్యాంక్ వారితో కలిసి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. అలాగే ఒక వ్యక్తి రక్తదానం చేయడం వలన 5గురి ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు.ఈ మెగా రక్తదాన శిబిరంలో ప్రజలు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల మల్టీ రీఛార్జ్ అధినేత గౌరినాయుడు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.