Breaking News

వైసీపీ బలపరిచిన వార్డు మెంబర్ అభ్యర్థులు విజయం.

0 424

పి.మాకవరం,రేవళ్ళు వార్డు మెంబర్లు గా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని పి.మాకవరం,రేవళ్ళు పంచాయితీలకు సంబంధించి వార్డు మెంబర్ల ఉప ఎన్నికలు ఈరోజు సజావుగా జరిగాయి.నడింపాలెం పంచాయితీలో మాత్రం వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విత్ డ్రా చేసుకోగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే పి.మాకవరం వార్డు మెంబర్ గా నర్సి పద్మలత,రేవళ్ళు వార్డు మెంబర్ గా గొట్టుపల్లి బాలరాజులమ్మ గెలుపొందారు.ఈ సందర్భంగా కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ.. రెండు చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.నడింపాలెం లో వైసీపీ బలపరిచిన అభ్యర్థిని పోటీలో లేకుండా ఉండేందుకు స్వయంగా వార్డు మెంబర్ అభ్యర్థి పాలిక బంగారమ్మ ఇంటికి వెళ్లి మరీ బెదిరించి, సీక్రెట్ గా తీసుకువెళ్లి విత్ డ్రా చేయించారని,ఇది దుర్మార్గపు చర్య అని ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,కినపర్తి సర్పంచ్ రీమల శ్రీను, రామరాజు పాలెం సర్పంచ్ సెగ్గే నూకాలమ్మ,మండల సచివాలయ కన్వీనర్ బండి సుధాకర్,మండల మహిళా అధ్యక్షురాలు సడ్డా సావిత్రి,పి.మాకవరం ఎంపీటీసీ సడ్డా మల్లీశ్వరి,నాయకులు పాటి శేఖర్,కొర్రా తిరుపతిరావు,కోడా రాజుబాబు,జన్ని నాగేంద్ర,కుశల,రేవళ్ళు మాజీ సర్పంచ్ దేముడు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.