పి.మాకవరం,రేవళ్ళు వార్డు మెంబర్ లు గా వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని పి.మాకవరం,రేవళ్ళు పంచాయితీలకు సంబంధించి వార్డు మెంబర్ల రీ ఎన్నికలు ఈరోజు సజావుగా జరిగాయి.నడింపాలెం పంచాయితీలో మాత్రం వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విత్ డ్రా చేసుకోగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో ఎటువంటి అలజడులు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొయ్యూరు సీఐ స్వామినాయుడు,ఎస్ఐ రాజారావు,మంప ఎస్ఐ లోకేష్ కుమార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే పి.మాకవరం వార్డు మెంబర్ గా నర్సి పద్మలత,రేవళ్ళు వార్డు మెంబర్ గా గొట్టుపల్లి బాలరాజులమ్మ గెలుపొందారు.