•వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ
•కృష్ణాదేవిపేట లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి వలసలు.
ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎదురు దెబ్బ తగిలింది.అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్ పురం రెండో సెగ్మెంట్ ఎంపిటిసి ఆర్.శివరామకృష్ణ, వైసీపీ నాయకులు గొర్లి లచ్చాబాబు,వార్డు మెంబర్ తో సహా పలువురు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ అడిగర్ల నాని బాబు,మాజీ జెడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..ఈ సైకో ప్రభుత్వం పోవాలన్న మీరందరూ సైకిల్ కి ఓటు వేయాలని అన్నారు.ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు,అన్యాయాలు ఎక్కువైపోయాయని అన్నారు. చదువుకున్నవారు యువత ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎదిరించి మాట్లాడాలని అన్నారు.చదువుకున్న వారు విద్యావంతులు అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం చాలా దారుణం అని అన్నారు.హుద్ హుద్ తుఫాన్ సమయంలో విశాఖపట్నం మిగిలింది అంటే దానికి కారణం రుషికొండ అని అటువంటి కొండలు తొలిచేస్తుంటే చదువుకున్న మేధావి వర్గం మాట్లాడకపోవడం దారుణమని అన్నారు.ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని దాన్ని ఎవరు అడ్డుకోలేరని అన్నారు.
తెలుగుదేశం పార్టీని ఎదురుకోలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని అందులో భాగంగా ఊళ్ళలోని తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగిస్తున్నారని వీటిని అందరూ అడ్డుకోవాలని అన్నారు.అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మూడు రాజధానుల నాటకం ఆడారని, పోలవరం కట్టలేదని,రైల్వే జోన్ లేకుండా చేశారని అన్నారు.నియోజవర్గంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా నడుస్తుందని,ఇవన్నీ చూసి ఎన్నో అడ్డంకులు కల్పించి,వచ్చే జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని అందుకే ఆటంకాలు కల్పిస్తున్నారని అన్నారు.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు ఎత్తి చూపించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వాటికి భయపడేది లేదని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో చింతకాయల రాజేష్, మండల పార్టీ ప్రెసిడెంట్ అడిగర్ల నానిబాబు,మాజీ జెడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాల్,మండల నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.