అంజు కంటి ఆసుపత్రి కాకినాడ వారిచే డాక్టర్ తేజ పర్యవేక్షణలో చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి పంచాయితీ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.మొత్తం 107 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.వీరిలో 26 మందికి డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని డాక్టర్ తేజ తెలిపారు.ఈ కార్యక్రమంలో అంజు కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.