Breaking News

విపరీతమైన జ్వరంతో పిహెచ్సి కి వెళ్తే వైస్ సర్పంచ్ ను కూడా పట్టించుకోని వైద్య సిబ్బంది.

0 1,194

విపరీతమైన జ్వరంతో పిహెచ్సి కి వెళ్తే వైస్ సర్పంచ్ ను కూడా పట్టించుకోని వైద్య సిబ్బంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రాత్రి నుండి విపరీతమైన జ్వరం,తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని కంఠారం పీహెచ్సీకి స్థానిక వైస్ సర్పంచ్ కాళ్ళ వనుంబాబు వెళ్తే కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9:30 గంటలకు వెళ్లి పదిన్నర గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నానని అయినప్పటికీ ఎవరు స్పందించడం లేదని ఆయన తెలిపారు.గంటసేపు ఆగి తిరిగి ఇంటికి వెళ్లి పోతూ ఉండగా ట్రీట్మెంట్ చేస్తామని పిలుస్తున్నారని అన్నారు.ఇంత నిర్లక్ష్యంగా ఉంటూ మనుషుల ప్రాణాలు అంటే కనీసం లెక్కలేకుండా ఉంటున్నారని కంఠారం పీహెచ్సీ వైద్య సిబ్బందిపై స్థానిక వైస్ సర్పంచ్ కాళ్ళ వనుంబాబు మండిపడుతున్నారు.కంఠారం పి.హెచ్.సి వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వైస్ సర్పంచ్ వనుంబాబు తెలిపారు.సొంత గ్రామంలోనే ఉన్న పీహెచ్సీ కి వెళ్లినా వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక నర్సీపట్నం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.సకాలంలో స్పందించాల్సిన అధికారులు కూడా వాస్తవాలు తెలిసినా పట్టించుకునే సందర్భాలు మాత్రం కనిపించడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటనలు మాత్రమే కనిపిస్తున్నాయి కానీ వాస్తవాల్లో పనులు మాత్రం జరగటం లేదని ఈ కంఠారం పిహెచ్సి ని చూస్తే అర్థమవుతుంది.మరి సామాన్య ప్రజలు అనారోగ్య బారిన పడితే పట్టించుకునేది ఎవరో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి.మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.