అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకులూరు సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం అనే కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు.ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితమని జల్లి బాబులు కొనియాడారు.అనంతరం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి వినోద్,వీఆర్వో చిరంజీవి,సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.