ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి- నా దేశం,నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం అనే కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొండగోకిరి సచివాలయం పరిధి లోని రత్నంపేట,కొండగోకిరి పంచాయితీల్లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బడుగు రమేష్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరి కాయ కొట్టి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు.అనంతరం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ముసలి నాయుడు, రత్నంపేట సర్పంచ్ పాటి నూకరత్నం, మండల సచివాలయ కన్వీనర్ బండి సుధాకర్, వైసిపి నాయకులు కాళ్ళ వనుంబాబు,పాటి శేఖర్,కొర్రా తిరుపతి రావు,ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ రాజు,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.