Breaking News

కొండగోకిరి లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

0 14


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొండగోకిరి పంచాయితీ గ్రామంలో ది తోడు 
లోకుల గాంధీ ట్రస్ట్ అలాగే అమ్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉజ్వల మల్టీ రీఛార్జ్ వారి సహకారంతో మదర్ బ్లడ్ బ్యాంక్ వారితో కలిసి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంను మదర్ బ్లడ్ బ్యాంక్ అధినేత గుప్తా,అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ జి.వి. రాజు,ఎంవివి ప్రసాద్ కలిసి ప్రారంభించారు. మొత్తం 60 మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమనికి ఇంత స్పందన రావడం పట్ల కొండగోకిరి దత్త పుత్రుడు మఠం మురళీ కృష్ణ మాట్లాడుతూ రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే లోకుల గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో లోకుల గాంధీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లోకుల రమేష్,ట్రస్టు గౌరవ అధ్యక్షులు లోకుల కిరణ్ మాస్టర్, ఉజ్వల మల్టీ రీఛార్జ్ అధినేత గౌరీ నాయుడు, కినపర్తి సర్పంచ్ రీమల శ్రీను,బిజెపి నాయకులు రీమల చంద్రరావు, మంగతల్లి యువ సైన్యం సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.