Breaking News

హింసను ప్రేరేపించిందే చంద్రబాబు-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి

0 30

•హింసను ప్రేరేపించిందే చంద్రబాబు-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి

•ఏపి పోలీసులకు సెల్యూట్ చెయ్యాలి.

పుంగనూరులో జరిగిన ఘటన వెనుక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రేరిపిత చర్యలు ఉన్నాయని రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.
ఈరోజు శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో ఏపి రాష్ట్ర పోలీసులు ఎంతో సహనంగా వ్యవహరించారని తెలిపారు.చంద్రబాబు కుట్రను కాని గమనించక పోయి ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగేదని ఆవేదన చెందారు.చంద్రబాబు కుట్ర రాజకీయాలకు సామాన్యులు బలి కావాలా అని ప్రశ్నించారు.పోలీసులు సంయమనం పాటించారు కాబట్టే 40 మంది పోలీసులకు తీవ్రంగా దెబ్బలు తగిలాయని ఇలాంటి వార్తలు పచ్చ మీడియాలో ఎందుకు ప్రచురించలేదో మీరు చెప్పాలని ప్రశ్నించారు.రామోజీరావుకు ఏమైనా విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు.రాష్ట్ర పోలీసులకు కలిగిన నష్టం కోసం కనీస బాధ్యతను పచ్చ మీడియాలో ఎందుకు రాయలేక పోయారు అని అడిగారు.చంద్రబాబు సినిమాలో మాదిరి కుట్ర దాడులను చేయించడం చేశారని.కారులో గన్ లు,బుల్లెట్లు ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు.బీరు బాటిల్లు,కర్రలు,కత్తులు ఎలా తీసుకు వచ్చారు.ఎందుకు తీసుకు వచ్చారు. బాలకృష్ణ సినిమాలో చూపించినట్లు దాడులు చేయాలని కుట్రలు పన్నారని అన్నారు.పోలీసు వాహనాలను తగలబెట్టడం చూస్తే పూర్తి స్థాయి ప్రణాళిక వేసుకుని చంద్రబాబు వచ్చారని పోలీసుల్లో ఎవరినైనా చంపేస్తే పోలీసులు ప్రతి చర్యగా కాల్పులు జరిపితే కార్యకర్తలు చనిపోతే వాటి ద్వారా రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించాలనే పెద్ద ప్రణాళికతో చంద్రబాబు ముందుకు వచ్చారని అర్ధం అవుతుందని తెలిపారు.చంద్రబాబు ముందస్తుగా ఇచ్చిన రూట్ ప్రణాళికను అప్పటికప్పుడు ఎందుకు మార్చినట్లు అనేది చంద్రబాబు కుట్ర ఆలోచనలకు ప్రతి రూపం అని తెలిపారు.చంద్రబాబు చిన్నపిల్లడు కాదు కదా.జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు సడన్ గా ఎలా రూట్ మారుస్తాడని అన్నారు.కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కోసం ఎంతో డబ్బలు వెచ్చిస్తుందని ముందస్తుగా లేని రూట్ ప్లాన్ ఎలా మారుస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు లోకేష్ మా దెబ్బ చూశారా అని అనడం వెనుక వారి కుట్రలు బయట పడుతున్నాయని తెలిపారు.దత్త పుత్రుడు పవన్ కి కనీసం నైతిక విలువలు కూడా లేవని, రాష్ట్రంలో పోలీసులు మీద దాడులు జరిగితే నోరు మెదపలేదని తిరుపతి వెల్లి కూర్చున్నాడని అన్నారు.చంద్రబాబు దగ్గర ఎంత ప్యాకేజికి అమ్ముడు పోయాఓ మరి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నీకు బాద్యత లేదా.పోలీసుల మీద జరిగిన దాడులపై పవన్ స్పందించాలంటే పవన్ కి ప్యాకేజి కావాలా అని ప్రశ్నించారు.చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాలలో ఎంత మందిని చంపేశాడో ప్రజలు గమనించాలని కోరారు.అలాగే ఇదేం కర్మ కార్యక్రమంలో కొంతమందిని చంపేశారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనించాలని మంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.