పోస్టాఫీసుల్లో జాతీయ జెండా అమ్మకాలు.
జాతీయ జెండా 25 రూపాయలకే అందిస్తున్నాం.
పాడేరు పోస్టల్ సబ్ డివిజన్ ఐపిఓ మురళి.
అల్లూరి జిల్లా పాడేరు: పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల అమ్మకాలు చేపడుతున్నట్టు పాడేరు సబ్ డివిజన్ ఐ పి ఓ మురళి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాడేరు పోస్టల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని సబ్ పోస్టాఫీసులు,బ్రాంచ్ పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాల అమ్మకాలు చేపడుతున్నట్టు తెలిపారు.కేవలం రూ.25లకు జాతీయ జెండాను అందిస్తున్నామన్నారు. గ్రామాలకు సమీపంలో ఉండే బ్రాంచ్ పోస్టాఫీసులకు వెళ్లి జాతీయ జెండాను కొనుగోలు చేసుకోవాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వాతంత్ర దినోత్సవ పండుగను గ్రామ గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు.