Breaking News

జీకే వీధి: బర్త్ వెయిటింగ్ హోమ్ ను ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే,పీఓ

0 100

అవగాహన లేమితోనే మాతా శిశు మరణాలు.
ఇంటి వద్దే డెలివరీ చేసుకోవాలనే మొండి పట్టుదలొద్దు.
సకల సదుపాయాలు ఉన్న బర్త్ వెయిటింగ్ హోమ్ ను ఉపయోగించుకోండి.
-పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం:
మనలో అవగాహన లేకపోవడంతోనే మాతా శిశు మరణాలు జరుగుతున్నాయని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అనేకమంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని దానివల్లనే ప్రసవ సమయంలో బిడ్డను గానీ,తల్లిని గాని లేకపోతే తల్లిబిడ్డలిద్దరినీ కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు.జీకే వీధి మండల కేంద్రంలో మంగళవారం రూ.30 లక్షలతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ హోమ్ (శిశు జనన నిరీక్షణ కేంద్రం) పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,ఐటిడిఏ పీవో అభిషేక్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నాలుగు,మూడు శాతం రక్తమున్న వ్యక్తులు కూడా హాస్పిటల్ కి రాకుండా ఇంటి వద్దే పురుడు పోసుకుంటున్న పరిస్థితులను ఈరోజు మనం చూస్తున్నామని వాటిలో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలని సూచించారు.ఇంటిదగ్గర పురుడు పోసుకోవడం వలన రక్తహీనత సమస్య వలన తల్లి చనిపోతున్నారని, సరైన పద్ధతిలో డెలివరీ చేయకపోవడం వల్ల బిడ్డను కూడా కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయన్నారు.ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ,వైద్య సిబ్బంది అంతా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామాల్లో ఆశా కార్యకర్తలు ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటారని వారితోపాటు ఏఎన్ఎం,హెల్త్ ప్రొవైడర్స్ ఆ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు.మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ వరకు మందులు వాడకంలో గానీ ఎప్పుడెప్పుడు స్కానింగ్ తీసుకోవాలనే దానిపై గాని నిరంతరం వారికి అవగాహన పరుస్తూ అందుబాటులో ఉన్న పిహెచ్సి కి తీసుకొచ్చి ఆ పనులు చేయించాలన్నారు.ఒకవేళ దగ్గరలో పిహెచ్సీ ఉంటే డెలివరీకి ఒకటి రెండు రోజులు ముందు వచ్చి ఆ పిహెచ్సి లో చేరి డెలివరీ అవ్వొచ్చని ఆ విధంగా లేని పక్షంలో తొమ్మిదో నెల వచ్చిన వెంటనే శిశు నిరీక్షణ కేంద్రంలో చేరాలని సూచించారు.జీకే వీధి మండల పరిధిలో 50 గ్రామాలు అత్యంత విస్తీర్ణంలో ఉన్నాయని వారు అత్యవసరంగా డెలివరీ నిమిత్తం హాస్పిటల్ కి రావాలంటే ఆరోజు ఏర్పడేటటువంటి పరిస్థితులను బట్టి గెడ్డలు,కొండలు దాటి రావడం ఇబ్బంది కాబట్టి తొమ్మిదో నెల దాటిన వెంటనే గర్భిణీ మహిళతో ఇంకొక సంరక్షకులు తీసుకొని శిశు నిరీక్షణ కేంద్రంలో చేరొచ్చని అక్కడ మీకు కావాల్సిన సకల సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రభుత్వమే చూసుకుంటూ డెలివరీ తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ లో మీ ఇంటి వద్దకి ప్రభుత్వమే చేరుస్తుందన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగానికి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఈ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్న విషయాన్ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పునరుద్ఘాటించారు.ప్రతి పిహెచ్సీ కి ఇద్దరు వైద్యులను తప్పనిసరిగా ఉండాలని పద్ధతిలో నియామకం జరిగిందన్నారు.మీ బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్,స్నానం చేసేందుకు గీజర్లు, నిద్రపోయేందుకు మంచాలు,ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకునేందుకు ఫ్రిజ్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి బర్త్ వెయిటింగ్ హాల్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి,జడ్పీటీసీ కిముడు శివరత్నం,సర్పంచ్ సుభద్ర,మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,వైస్ ఎంపీపీలు ఎస్.ఆనంద్,ఎల్.దేముడు,మార్కెట్ కమిటీ చైర్మన్ జైతి రాజులమ్మ, చింతపల్లి ఎంపీపీ అనూష,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అచ్యుత్,పి ఏ సి ఎస్ చైర్మన్ వసుపరి ప్రసాద్,కంకిపాటి గిరిప్రసాద్,ఎంపిటిసిలు నాగమణి,రాజులమ్మ, సరస్వతి,కృష్ణమూర్తి,సత్యనారాయణ,సర్పంచులు వంశీకృష్ణ,కే రవీంద్ర, ప్రసాద్,స్థానిక నాయకులు జయప్రసాద్,పి.నూకరాజు,సిహెచ్ శ్రీధర్,కే రాంబాబు,పి రామకృష్ణ,జి లక్ష్మణరావు,త్రిమూర్తులు,కోఆప్షన్ సభ్యులు దావీద్,మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మజీద్, కొయ్యూరు మండల వైసీపీ నాయకుడు రీమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.