Breaking News

కొయ్యూరు: జగనన్న సురక్ష కార్యక్రమంపై వర్క్ షాప్.

0 17

 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మండల పరిషత్ కార్యాలయంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంపై సచివాలయం సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్స్,డిజిటల్ అసిస్టెంట్స్, వీఆర్వో లు, పంచాయితీ కార్యదర్శులుతో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం జూలై 1 నుండి ఆగస్ట్ 1 వరకు మండలంలో 23 సచివాలయాలు మండల టీమ్ లు పర్యవేక్షించడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు.

12 సచివాలయాలు ఎంపిడిఓ,11 సచివాలయాలు ఎమ్మార్వో ఆధ్వర్యంలో  జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లాలం సీతయ్య, తహశీల్దార్ తిరుమలరావు, ఈఓపీఆర్డి ఆర్ పి నాయుడు,డిటి,ఆర్ఐ పాల్గొన్నారు.

జగనన్న సురక్ష పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారు? షెడ్యూల్ ఇదే:

ఈ పథకాన్ని జూలై 1 నుంచి నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. జగనన్న సురక్షలో భాగంగా వివిధ పథకాలు కింద అర్హులుగా గుర్తించిన వారిని ఆగస్టు ఒకటిన ప్రకటించడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి జూన్ 24 నుంచి వాలంటీర్లు ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.

ఇంటింటికి వెళ్లి సమస్యలు నమోదు:

జూలై 1 నుంచి సచివాలయాలు మండల స్థాయిలో క్యాంపులు నిర్వహించే ముందు జూన్ 24 నుంచి సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు,గృహ సారధులు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కూడా ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వెంటనే నమోదు చేసుకోవడం జరుగుతుంది. వీరికి జూలై 1 నుంచి క్యాంపు ల ద్వారా ఆయా సచివాలయాల పరిధిలో వెంటనే సర్టిఫికేట్లు జారీ చేయడం జరుగుతుంది. ఏమైనా పథకాలకు సంబంధించి సమస్యలు ఉన్నా పరిష్కరించడం జరుగుతుంది.

అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష?

ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

ప్రజల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగనుంది.

నెల రోజులపాటు కొనసాగనున్న ఈ జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజల సమస్యలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు లేదా ఏదైనా పత్రాలు సర్టిఫికెట్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వారిని వెంటనే సచివాలయాల వద్దకు తీసుకువచ్చి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు లేదా డాక్యుమెంట్లు లేదా పథకాలకు అర్హతలకు సంబంధించి ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతారు.

Leave A Reply

Your email address will not be published.