Breaking News

వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి-మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 139

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమయత్తం కావాలి.

అందరు సమన్వయంగా పనిచేసి తెదేపాను గెలిపించాలి.

కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది.

వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

గిరిజనుల అభివృద్ధికి బాట వేసింది ఎన్టీఆర్.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన జగన్ రెడ్డి.

-పాడేరు నియోజకవర్గ సమన్వయ సమావేశంలో గిడ్డి ఈశ్వరి,పరిశీలకులు రాజమండ్రి నారాయణ.

అల్లూరి జిల్లా పాడేరు: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సమాయత్తంగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.పాడేరు నియోజకవర్గం పరిశీలకులు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమన్వయ సమావేశనికి అధ్యక్షత అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్ వహించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి,పరిశీలకులు రాజమండ్రి నారాయణ మాట్లాడుతూ అందరూ సమన్వయంగా పనిచేయాలని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని,పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన జగన్మోహన్ రెడ్డిని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రతి ఇంటిలో ఓట్లు వెరిఫికేషన్ జరగాలని దొంగ ఓట్లు గుర్తించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గిరిజన ప్రాంతంలో అభివృద్ధి బాట వేసింది అప్పుడు ఎన్టీఆర్ అన్నారు.పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తులకు తగిన గుర్తింపు ఉంటుందని ఈ వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలు నేటికీ పూర్తి కాలేదని విమర్శించారు. నేడు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసిన రోడ్లు పెద్ద పెద్ద గోతుల మయంతో కనిపిస్తున్నాయని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఇచ్చినటువంటి హామీలు నేటికి పూర్తి కాని విధానంపై సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రతి ఒక్కరు చేయాలని అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మీడియా సమావేశం కూడా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.గిరిజన ప్రాంతంలో గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టి వేస్తే దాన్ని రివ్యూ పిటిషన్ కూడా వెయ్యలేని దుస్థితిలో గిరిజన వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు.మన బ్రతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తప్ప మన బ్రతుకులు బాగుపడవని అన్నారు.మన ఆయుధం మనకు సంక్షేమ పథకాలు మన అధినేత మహానాడులో విడుదల చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి వైసిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలు,దౌర్జన్యాలు పై ప్రజలకు వివరించాలని అన్నారు.ఈ సమన్వయ సమావేశానికి రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శులు సోమేలి చిట్టిబాబు,గబ్బాడ సింహాచలం,కొట్టగుల్లి రమేష్ నాయుడు,అరకు పార్లమెంట్ కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి,పార్టీ సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, రామ్మూర్తి,సమిరెడ్డి నాగబ్బాయి,పాటి బింబాబు,కిడారి బింబాబు, పాడేరు,జి.మాడుగుల,చింతపల్లి,కొయ్యూరు,జికె వీధి మండల అధ్యక్షులు కుడి రామనాయుడు,వంతల కొండలరావు,కిల్లో పూర్ణచంద్రరావు,ముక్కల రమేష్,గొలిసింగి సత్యనారాయణ..ఐదు మండలాల ప్రధాన కార్యదర్శులు తోట దొరబాబు,లక్ష్మణరావు,కళ్యాణం, వెంకట్,రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు డప్పోడి వెంకటరమణ,ఐ టి డి పి ఇంచార్జ్ బుద్ధ జ్యోతి కిరణ్,బి.సత్య,నళిని కృష్ణ,దేవి,రాజేశ్వరి,క్లస్టర్ ఇన్చార్జ్ లు,యూనిట్ ఇన్చార్జ్ లు, నియోజకవర్గంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.