Breaking News

బూదరాళ్ల సచివాలయంలో ‘జగనన్న సురక్ష’పై సమావేశం.

0 17


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూధరాళ్ళ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాలలో జారీ చేసే సర్టిఫికెట్లను ఉచితంగా ఇవ్వాలని కుల, నివాస, ఇన్కమ్, డేట్ అఫ్ బర్త్, డెత్,మ్యుటేషన్ ఫర్ ట్రాన్స్ఫర్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, మొబైల్ నెంబర్ అప్డేట్, కొత్త రేషన్ కార్డ్, రేషన్ కార్డు నమోదు,కౌలు గుర్తింపు కార్డులు వంటివి ఫీజు లేకుండా ఈనెల 23వ తేదీ నుంచి నెల రోజులు ఉచితంగా అందించాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఎల్ఓ,సచివాలయ కన్వీనర్ తిరుపతి, పంచాయితీ కార్యదర్శి శ్రీనువాసు, వీఆర్వో భీమన్నదొర, వార్డు మెంబర్ సాగిన సంజీవ్,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,గృహసారధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.