Breaking News

వెలుగు సిబ్బంది గ్రామ సంఘం సహాయకులకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు.

0 69

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: మండల సమాఖ్య పరిధిలో గల 50 మంది గ్రామ సంఘం సహాయకులకు రెండు రోజుల పాటు ఆర్థిక నిర్వహణ,పుస్తక నిర్వహణపై శిక్షణా తరగతులు కొయ్యురు వెలుగు ఆఫీస్ నందు ఎపియం శ్రీనివాస్ శిక్షణ ఇవ్వడం జరిగింది.ఇందులో ప్రధానంగా సంఘాలు లోన్స్ తీసుకుని ఏవిధంగా జీవనోపాధికి ఉపయోగించాలి,ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి,విఓఏ లు ఏవిధంగా సంఘాలు ఆర్థికాభివృద్ధికి సహాయం చెయ్యాలి,సిబ్బంది మహిళలతో ఏవిధంగా నడుచుకోవాలి,వారిని ఏ విధంగా గౌరవించాలి మొదలగు అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఓటి లు నాగేశ్వరరావు,మీనాక్షి,ఇతర సిసి లు హెచ్ డి సిసి ప్రసాద్,ఎఫ్ పీ ఓ సిసి చిన్నబాబు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.