గిరిజనుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?
కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న గిరిజనుడు కూడా లోవరాజు ను కంటారం పీహెచ్సీ డాక్టర్ బేగం ఆదేశాల మేరకు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ గేట్ ముందు దించి వెళ్లిపోయిన అంబులెన్స్ డ్రైవర్.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం అంకంపాలెం పంచాయితీ గ్రామానికి చెందిన కూడా లోవరాజు కి 24గంటల నొప్పి రావడంతో అంకంపాలెం నుండి దగ్గరలో ఉన్న కంఠారం పీహెచ్సీకి తీసుకువెళ్లారు. పేషెంట్ ని విశాఖ కేజీహెచ్ కి తీసుకు వెళ్లమని హాస్పిటల్ సిబ్బంది చెప్పినట్లు అంకంపాలెం సర్పంచ్ శ్రీను చెప్తున్నారు.
అయితే లోవరాజు ను అంబులెన్స్ ద్వారా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి తరలించి అక్కడ పేషెంట్ ను దించి వచ్చేయాలని అంబులెన్స్ డ్రైవర్ ని కంటారం పీహెచ్సీ డాక్టర్ బేగం ఆదేశించారని సర్పంచ్ తెలిపారు.
పేషంట్ కడుపునొప్పి వల్ల తీవ్ర ఇబ్బందితో బాధపడుతున్నాడని కేజీహెచ్ వరకు అంబులెన్స్ ని పంపించాలని డాక్టర్ బేగం ను ఎంత బ్రతిమాలిన ఆమె వినలేదని సర్పంచ్ శ్రీను తెలిపారు.దీంతో చేసేదేమీ లేక ఏరియా ఆస్పత్రి నుండి మళ్ళీ నర్సీపట్నం బస్ కాంప్లెక్స్ కి ప్రైవేట్ వాహనం ద్వారా తీసుకువెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కించి కూర్చోబెట్టానని అన్నారు. బస్ కాంప్లెక్స్ నుండి కూడా డాక్టర్ తో ఫోన్లో మాట్లాడానని అయినా ఆమె వినిపించుకోలేదని అన్నారు. గిరిజనుల ప్రాణాలు అంటే డాక్టర్ కి ఎంత చులకనో అర్థమవుతుందని అన్నారు. పేషెంట్ విషయమై సంబంధిత అధికారి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ ద్వారా సమాచారం అందించానని,ఒకవైపు డిఎం అండ్ హెచ్ ఓ తో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పటికీ అది కూడా పట్టించుకోకుండా అంబులెన్స్ ని వెనక్కి తీసుకువచ్చేయాలని అంబులెన్స్ డ్రైవర్ ను మరలా చెప్పారని సర్పంచ్ అన్నారు.ఈ కాలంలో కూడా గిరిజనులను ఇంత చులకనగా చూసే అధికారులు ఉండడం విచారకరమని సర్పంచ్ అన్నారు.ఒక సర్పంచ్ అయిన నాకే ఈ పరిస్థితి ఎదురయ్యింది అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.చివరికి డిఎం అండ్ హెచ్ ఓ పేషెంట్ ని కేజీహెచ్ వరకు తీసుకువెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ ని ఆదేశించగా ఆయన చొరవతో,మళ్ళీ పేషెంట్ ను బస్సు నుండి కిందకు దింపి అంబులెన్స్ ద్వారా పేషంట్ లోవరాజుని కేజీహెచ్ కి తీసుకువెళ్లడం జరుగుతుందని సర్పంచ్ అన్నారు.ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ ఓ కి సర్పంచ్ శ్రీను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే గిరిజనుల ప్రాణాలను లెక్కచేయకుండా చులకనగా చూస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కంటారం పిహెచ్సి డాక్టర్ బేగం తీరుకు నిరసనగా ఈనెల 7వ తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు ఆ పరిసర ప్రాంత గిరిజనులతో కంటారం పిహెచ్సీ ముందు ధర్నా చేయనున్నట్లు అంకంపాలెం సర్పంచ్ శ్రీను తెలిపారు.గిరిజనుల ప్రాణాలు అంటే ఇంత నిర్లక్ష్యంగా,లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న డాక్టర్ బేగం ను వేరే దగ్గరికి బదిలీ చేసి,కేవలం జీతం కోసం పనిచేసే డాక్టర్ ని కాకుండా గిరిజనుల ప్రాణాలను కాపాడగలిగే ఆలోచన గల డాక్టర్ ను కంటారం పీహెచ్సిలో నియమించాలని సర్పంచ్ శ్రీను అధికారులను కోరుతున్నారు.