రైతును ప్రోత్సహించడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం.
నేడు కొయ్యూరు కేంద్రంలో కోపరేటివ్ బ్యాంక్ సహకార సంఘం నుండి రైతులకు రుణాలు పంపిణీ.
ఎంపీపీ బడుగు రమేష్,పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు చేతుల మీదుగా చెక్కలు పంపిణీ.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని వ్యవసాయ సహకార సంఘం నుండి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసి ఈరోజు 3 లక్షల 7,0000 రూపాయల చెక్కును పంపిణీ చేసారు.
అనంతరం ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ..రైతులు సహకార బ్యాంకులను బ్రతికించాలని,రైతులు రుణాలు తీసుకోవడం,సకాలంలో బకాయిలు చెల్లించడం,నిరంతరం జరగాలని, ఈ మధ్య కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన వారు సభ్యత్వం బ్యాంకు లో పొందాలని కోరారు.
వ్యవసాయ రంగంలో ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం మంచిగా ఉపయోగించి ఈ మండలంలో వ్యవసాయ మార్కెటింగ్ అభివృద్ధి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఉద్యోగులు,
లబ్ధిదారులు పాల్గొన్నారు.