Breaking News

ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలు

0 19

‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలు.

చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలి: సీఎం

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన సీఎం

తాడేపల్లి: చక్కటి స్ఫూర్తిని నింపేలా రాష్ట్రంలో ఆటల పోటీలు సాగాలని సీఎం జగన్ సూచించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వ‌హించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీల నిర్వహణ పై అధికారులు సీఎంకు వివరాలు అందించారు.

ఈ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలి: సీఎం

ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలు చక్కటి స్ఫూర్తిని నింపేలా సాగాలని అధికారులకు సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఇవి ఉపయోగపడాలని తెలిపారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలని అన్నారు. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం దిశగా అడగులు వేయాలని సూచించారు. ఇది సాకారం అయ్యాక ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న వైయస్సార్‌ స్టేడియంను, క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగులు వేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని, కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్‌ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని సీఎం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.